RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, అక్టోబర్ 2025, ఆదివారం

భాగ్యనగర గాథా | Bhagyanagara Gadha | Burrakatha Lyrics | Vichitra Bandham (1972)

భాగ్యనగర గాథా



చిత్రం :  విచిత్ర బంధం (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :


భళి భళి వినరా ఆంధ్ర కుమారా 

భాగ్యనగర గాథా మన రాజధాని గాథా

వలపులవంతెన మూసీ నదిపై 

వెలసినట్టి గాథా

మన రాజధాని గాథా 


గోలుకొండను ఏలుచుండెను 

గొప్పగ మల్కిభరాం

ఓయ్...గొప్పగ మల్కిభరాం

ఆతని కొడుకు అందాల రాజు...  

కులీ కుతుబ్ షా

కులీ కుతుబ్ షా


చంచలపల్లెను వసించుచుండెను

నర్తకి భాగమతి... నర్తకి భాగమతి

సరసుడు యువరాజామెను చూసి

మనసునిచ్చినాడు...  

తందాన తాన తానతందనాన


చరణం 1 :


కలల జల్లుల కారుమబ్బులు 

కాటుకలద్దిన కన్నులు

మబ్బు విడిచిన చంద్రబింబము 

మగువ చక్కని వదనము

మెల్లమెల్లగ హృదయ వీణను 

మీటగలవీ లేతవేళ్ళు

ఘల్లుఘల్లున గుండె ఝల్లన 

కదలి ఆడును కన్నెకాళ్ళు


అందరి కన్నులు నా మీద...  

నా కన్నులు మాత్రం నీ మీద...  

శభాష్ 

అందరి కన్నులు నా మీద...  

నా కన్నులు మాత్రం నీ మీద


కాసులు విసిరే చేతులకన్నా...  

కలసీ నడిచే కాళ్ళేమిన్నా

మనుగడకోసం పాడుతువున్న... 

ఆ..ఆ..ఆ..ఆ

మనసున నిన్నే పూజిస్తున్నా

అందరి కన్నులు నా మీద...  

నా కన్నులు మాత్రం నీ మీద..

నీ మీద..నీ మీద..నీ మీద


నింగివి నీవు రంగుల హరివిల్లు నీవు

పూర్ణిమ నీవు...  పొంగే కడలివి నీవు

నీ మువ్వలలో...  నీ నవ్వులలో

నీ మువ్వలలో...  నీ నవ్వులలో

మురిసింది మూసీ...  

విరిసింది నీ ప్రణయదాసి

ఆహాహా..ఆహాహా .... ఆహాహా..ఆహాహా...

అందరి కన్నులు నా మీద...  

నా కన్నులు మాత్రం నీ మీద..

నీ మీద..నీ మీద..నీ మీద

 

చరణం 2 :


రారా నా ప్రియతమా...  

రారా నా హృదయమా

నా వలపే నిజమైతే...  

ఈ పిలుపు నీవు వినాలి

రారా నా ప్రియతమా...

నేనీ ఇలలోన...  నువ్వా గగనాన

మూసీనది చేసినది ప్రళయ గర్జన

పెను తుఫాను వీచినా...  

ఈ ప్రమిద ఆరిపోదురా

వరద వచ్చి ముంచినా...  

ఈ బ్రతుకు నీది నీదిరా

రా  రా రా ప్రియతమా... 

రా రా రా ప్రియతమా... 

రా రా రా ప్రియతమా 


పిలుపును విన్న యువరాజు... సై

పెటపెటలాడుచు లేచెను... సై

ఎదురైన పహరావారిని... సై

ఎక్కడికక్కడకూల్చెను...  సై

ఉరుముల మెరుపుల వానల్లో... సై

ఉరికెను మూసీ నదివైపు...


ఆవలి ఒడ్డున బాగమతి... 

ఈవల ప్రేమ సుధామూర్తి

ప్రియా... ఓ ప్రియా... ప్రియా... ప్రియా

ఓ ప్రియా ప్రియా...  

అను పిలుపులు దద్దరిల

వరదనెదిర్చి వలపు జయించి... 

ఒదిగిరి కౌగిలిలో


మల్కిభరామా పవిత్రప్రేమకు 

మనసు మారిపోయి

చార్మినారూ పురానపూలు... 

చరితగ నిర్మించె

భాగమతి పేరిట వెలసెను 

భాగ్యనగరమపుడు

భాగమతి పేరిట వెలసెను 

భాగ్యనగరమపుడు

మన రాజథాని ఇపుడు...

మన రాజథాని ఇపుడు


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు