RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, అక్టోబర్ 2025, సోమవారం

నీలాల నింగి మెరిసిపడే | Neelalaningi Merisipade | Song Lyrics | Gandikota Rahashyam (1969)

నీలాల నింగి మెరిసిపడే



చిత్రం: గండికోట రహస్యం (1969)

సంగీతం: టి.వి. రాజు

గీతరచయిత: సి. నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


నీలాల నింగి మెరిసిపడే 

నిండు చందురుడా

నిరు పేద కలువ వేచెనని 

మరచిపోదువా..ఆ..ఆ..


అనురాగ మధువు దాచిన 

మనసైన ప్రియతమా

నెలరాజు కలువ చెలిమి మరచి 

నిలువగలుగునా..ఆ..ఆ..


నీలాల నింగి మెరిసిపడే 

నిండు చందురుడా..


చరణం 1:


నీ కోసము కుసుమించెను 

శతకోటి తారలు

నీ కోసము కురిపించెను 

పన్నీటి ధారలు

నీ కోసము కుసుమించెను 

శతకోటి తారలు

నీ కోసము కురిపించెను 

పన్నీటి ధారలు

ఆ తళుకలలో పరవశించి 

కరగిపోదువా..


అనురాగ మధువు దాచిన 

మనసైన ప్రియతమా..

నెలరాజు కలువ చెలిమి మరచి 

నిలువగలుగునా..ఆ..ఆ..


నీలాల నింగి మెరిసిపడే 

నిండు చందురుడా..


చరణం 2:


అలనాడే నిన్ను కన్నులలో 

నిలుపుకొంటిని

ఎద నిండ ప్రణయ పరిమళాలు 

పొదుగుకుంటిని

అలనాడే నిన్ను కన్నులలో 

నిలుపుకొంటిని

ఎద నిండ ప్రణయ పరిమళాలు 

పొదుగుకొంటిని

ఎన్నెన్ని జన్మలైన గాని 

నిన్ను మరతునా..ఆ..ఆ..


నీలాల నింగి మెరిసిపడే 

నిండు చందురుడా

నిరు పేద కలువ వేచెనని 

మరచిపోదువా..ఆ..ఆ..


ఆహహాహ ఆహహాహ హాహాహహహా..

ఊఁహూఁహూఁహూఁహుఁ.. 

ఊఁహూఁహూఁహూఁహుఁ..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు