RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, అక్టోబర్ 2025, సోమవారం

తెలిసింది తెలిసింది అబ్బాయిగారు | Telisindi Telisindi Abbayigaru | Song Lyrics | Gandikota Rahashyam (1969)

తెలిసింది తెలిసింది అబ్బాయిగారు



చిత్రం: గండికోట రహస్యం (1969) 

సంగీతం: టి.వి. రాజు 

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 


పల్లవి: 


తెలిసింది తెలిసింది అబ్బాయిగారు 

తెల్లారిపోయింది మీ కోడెపొగరు... 

నేనే తోడు రాకుంటే..

మీ పని అయ్యేది బేజారు 


తెలిసేది తెలిసేది అమ్మాయిగారు... 

నీలాటి రేవున్న నీ పిల్ల వగరు.. 

నేనే ఆదుకోకుంటే 

నీ పని అయ్యేది కంగారు... 


చరణం 1: 


మాటలు వింటుంటే కోటలు దాటే...

టెక్కులు చూస్తుంటే చుక్కల మీటే 

మాటలు వింటుంటే కోటలు దాటే...

టెక్కులు చూస్తుంటే చుక్కల మీటే 

తెలిసే రంగు పాలపొంగు...

వట్టి హంగు వగలు పొంగు.. 

తెలిసే రంగు పాలపొంగు...

వట్టి హంగు వగలు పొంగు.. 

నీ అల్లరి చూపుల 

కళ్ళెం వేసి ఆడించకు... 


తెలిసేది తెలిసేది అమ్మాయిగారు... 

నీలాటి రేవున్న నీ పిల్ల వగరు.. 

నేనే ఆదుకోకుంటే 

నీ పని అయ్యేది కంగారు... 


చరణం 2: 


కనుబొమ్మలాడితే కాలం ఆగే...

విసురుగ సాగితే వెన్నెలలూగే... 

కనుబొమ్మలాడితే కాలం ఆగే...

విసురుగ సాగితే వెన్నెలలూగే... 

లేత వయస్సు...లేడి సొగసు...

కోతి మనసు కొంత తెలుసు 

లేత వయస్సు...లేడి సొగసు...

కోతి మనసు కొంత తెలుసు 

నీ మెత్తని నవ్వుల 

గుత్తులు విసిరి వేధించకు... 


తెలిసింది తెలిసింది అబ్బాయిగారు 

తెల్లారిపోయింది మీ కోడెపొగరు... 

నేనే తోడు రాకుంటే..

మీ పని అయ్యేది బేజారు 


తెలిసేది తెలిసేది అమ్మాయిగారు... 

నీలాటి రేవున్న నీ పిల్ల వగరు.. 

నేనే ఆదుకోకుంటే 

నీ పని అయ్యేది కంగారు... 


అహహహ..ఆహా..హా...

అహహహ..ఆహా..హా... 

ఓహొహొహొహొ..ఓహో..హో...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు