RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, జూన్ 2025, శుక్రవారం

రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము | Rallallo Isakallo Rasamu | Song Lyrics | Seetharama Kalyanam (1986)

రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము



చిత్రం  :  సీతారామకళ్యాణం (1986)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత  :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  బాలు, సుశీల 


పల్లవి :


లలలలలలా... లలలలా లలలలలా..

లలలలలలా... లలలలా లలలలలా..

ఊహూహూ.. ఆహహా.. ఓహోహో..

లలాల.. ఆహాహా.. ఓహోహో.. 


రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము 

ఇద్దరి పేర్లు

కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో 

ఒక్కసారి

కలలలోన తీయగా గురుతు తెచ్చుకో


రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము 

ఇద్దరి పేర్లు

కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో 

ఒక్కసారి

కలలలోన తీయగా గురుతు తెచ్చుకో 


చరణం 1 :


కలలన్ని పంటలై పండెనేమో... 

కలిసింది కన్నుల పండగేమో

చిననాటి స్నేహమే అందమేమో.. 

అది నేటి అనురాగ బంధమేమో


తొలకరి వలపులలో.. 

పులకించు హృదయాలలో

తొలకరి వలపులలో.. 

పులకించు హృదయాలలో


యెన్నాళ్ళకీనాడు విన్నాము 

సన్నాయి మేళాలు

ఆ మేళ తాళాలు 

మన పెళ్ళి మంత్రాలై 

వినిపించు వేళలో

యెన్నెన్ని భావాలో ..


రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము 

ఇద్దరి పేర్లు

కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో 

ఒక్కసారి

కలలలోన తీయగా గురుతు తెచ్చుకో


చరణం 2 :


చూశాను యెన్నడో పరికిణిలో.. 

వచ్చాయి కొత్తగా సొగసులేవో

హృదయాన దాచిన పొంగులేవో.. 

పరువాన పూచిన వన్నెలేవో


వన్నెల వానల్లో.. వనరైన జలకాలలో

వన్నెల వానల్లో.. వనరైన జలకాలలో


మునగాలి తేలాలి.. 

తడవాలి ఆరాలి మోహంలో

ఆ మోహా దాహాలు 

మన కంటి పాపల్లో 

కనిపించు గోములో

యెన్నెన్ని కౌగిళ్ళో..


రాళ్ళళ్ళో ఇసకల్లో రాశాము 

ఇద్దరి పేర్లు

కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో 

ఒక్కసారి

కలలలోన తీయగా గురుతు తెచ్చుకో

లలలలలలా... లలలలలలా

లలలలలలా... లలలలలలా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా | Nuvvitta Nenatta | Song Lyrics | Seethamalakshmi (1978)

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా చిత్రం :  సీతామాలక్ష్మి (1978) సంగీతం :  కె.వి. మహదేవన్ గీతరచయిత :  వేటూరి నేపధ్య గానం :  బాలు, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు