RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, జూన్ 2025, శనివారం

నీరెండ దీపాలు నీ కళ్ళలో | Neerenda Deepalu | Song Lyrics | Illalu (1981)

నీరెండ దీపాలు నీ కళ్ళలో



చిత్రం : ఇల్లాలు (1981)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత :వేటూరి

నేపథ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


నీరెండ దీపాలు నీ కళ్ళలో...

నా నీడ చూసాను ఎన్నాళ్ళకో....

ఈ కొండకోనల్ల వాకిళ్ళలో.... 

నీదాననైనాను కౌగిళ్ళలో.... 


నీరెండ దీపాలు నీ కళ్ళలో....

నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... 


చరణం 1 :


ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో

ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో

నీ అందచందాలు మందారమై

నీ రాగభావాలు శృంగారమై


ఈ కొండగాలుల్లో నా గుండె ఊసుల్లో

నీ మాట అనురాగ సంగీతమై

నీ చూపు ప్రణయాల పేరంటమై

పొద్దెరగని ముద్దులలో 

ముద్దగ తడిసేవేళ


నీరెండ దీపాలు నీ కళ్ళలో.... 

నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... 


చరణం 2 :


నా ఆశలీనాడు ఆకాశమే చేరి

నా ఆశలీనాడు ఆకాశమే చేరి

మెరిసేను తారల్ల మణిహారమై

విరిసేను జాబిల్లి మనతీరమై


అందాల హరివిల్లు పొదరిల్లుగా మారి

వరిచేను విరిపానుపు మనకోసమై

కరగాలి జతగూడి మనమేకమై

ముద్దులలో నెలబాలుడి 

నిద్దురపోయిన వేళ


నీరెండ దీపాలు నీ కళ్ళలో.... 

నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు