RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, జూన్ 2025, ఆదివారం

అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ | Anukoledamma Ila Vuntundani | Song Lyrics | Trishulam (1982)

అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ



చిత్రం: త్రిశూలం (1982) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ 

ఇలా అవుతుందనీ 

ఏదో మత్తుందనీ మతే పోతుందనీ 

అనుభవమైన ఇప్పటి దాకా 

అనుకోలేదమ్మా 


నేనూ అనుకోలేదమ్మ 

ఇలా ఉంటుందనీ 

ఇలా అవుతుందనీ 

ఏదో మత్తుందనీ మతే పోతుందనీ 

అనుభవమైన ఇప్పటి దాకా 

అనుకోలేదమ్మా 


అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ 

ఇలా అవుతుందనీ 


చరణం 1: 


ఒక్క క్షణంలో నాకే తెలియక 

ఏదో జరిగింది 

సిగ్గు వచ్చి నా చెంప మీటితే 

ముద్దని తెలిసింది 


ఒక్క క్షణంలో నాకే తెలియక 

ఏదో జరిగింది 

సిగ్గు వచ్చి నా చెంప మీటితే 

ముద్దని తెలిసింది 


నిన్ను చూసుకొని అనురాగానికి 

వేగం వచ్చింది 

నిన్ను చూసుకొని అనురాగానికి 

వేగం వచ్చింది 

కన్నె పెదవిపై ముద్ర వేసి 

అది హద్దును చెరిపింది 


సిగ్గు... చెంప... పెదవీ... ముద్దు 

సిగ్గు... చెంప... పెదవీ... ముద్దు 

వలపుల తావులనీ వావీ వరసలనీ... 

అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ 

ఇలా అవుతుందనీ... 


చరణం 2: 


గాలి వీచితే పరవశమంది 

తీగే ఊగిందో 

తీగ ఊగితే పరువం వచ్చి 

గాలే వీచిందో... 


గాలి వీచితే పరవశమంది 

తీగే ఊగిందో..ఓ..ఓ.. 

తీగ ఊగితే పరువం వచ్చి 

గాలే వీచిందో 


తేటి పాపకు ఆకు చాటునా 

పువ్వే విరిసిందో 

తేటి పాపకు ఆకు చాటునా 

పువ్వే విరిసిందో 

పువ్వు సొగసుకు తేటి గొంతులో 

పాటే పలికిందో 


గాలి... తీగ... పువ్వూ... తుమ్మెదా... 

గాలి... తీగ... పువ్వూ... తుమ్మెదా... 

కలిసిన జంటలనీ... కలవక ఉండవనీ 

నేను అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ 

ఇలా అవుతుందనీ 

ఏదో మత్తుందనీ మతే పోతుందనీ 

అనుభవమైన ఇప్పటి దాకా 

అనుకోలేదమ్మా 


నేనూ అనుకోలేదమ్మ ఇలా ఉంటుందనీ 

ఇలా అవుతుందనీ 

ఏదో మత్తుందనీ మతే పోతుందనీ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు