RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

2, జూన్ 2025, సోమవారం

ఏమని నే చెలి పాడుదునో | Emani Ne Cheli paduduno | Song Lyrics | Mantrigari Viyyankudu (1983)

ఏమని నే చెలి పాడుదునో



చిత్రం :  మంత్రిగారి వియ్యంకుడు ( 1983)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపథ్య  గానం :  బాలు, జానకి


పల్లవి:


ఏమని నే..  చెలి పాడుదునో

తికమకలో ఈ మకతికలో

తోటలలో .. పొదమాటులలో .. 

తెరచాటులలో...


ఏమని నే మరి పాడుదునో

తికమకలో ఈ మకతికలో


చరణం 1:


నవ్వు .. చిరునవ్వు .. 

విరబూసే పొన్నలా

ఆడు .. నడయాడు .. 

పొన్నల్లో నెమలిలా


పరువాలే పార్కుల్లో .. 

ప్రణయాలే పాటల్లో

నీ చూపులే నిట్టూర్పులై .. 

నా చూపులే ఓదార్పులై

నా ప్రాణమే నీ వేణువై .. 

నీ ఊపిరే నా ఆయువై ..

సాగే తీగ సాగే రేగిపోయే 

లేత ఆశల కౌగిట.. 


ఏమని నే.. మరి పాడుదునో.. 

తికమకలో ఈ మకతికలో


చరణం 2:


చిలక .. గోరింక .. 

కలబోసే కోరిక

పలికే .. వలపంతా .. 

మనదేలే ప్రేమికా


దడ పుట్టే పాటల్లో .. 

ఈ దాగుడుమూతల్లో

ఏ గోపికో దొరికిందని .. 

ఈ రాజుకే మరుపాయెనా

నవ్విందిలే బృందావని.. 

నా తోడుగా ఉన్నావని..

ఊగే తనువులూగే.. 

వణకసాగె రాసలీలలు ఆడగ 


ఏమని నే..  మరి పాడుదునో ..

తొలకరిలో తొలి అల్లరిలో 

మన అల్లికలో..


ఏమని నే..  చెలి పాడుదునో

తికమకలో ఈ మకతికలో


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు