RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

2, మే 2025, శుక్రవారం

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా 



చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  బాలు, జానకి 


పల్లవి : 


కౌగిలిలో ఉయ్యాలా 

కన్నులలో జంపాలా

కౌగిలిలో ఉయ్యాలా 

కన్నులలో జంపాలా

కలసి వూగాలిలే... 

కరిగిపోవాలిలే..  

తనివి తీరాలిలే


చరణం 1 : 


నీ బుగ్గలఫై ఆ ఎరుపు..  

నీ పెదవులఫై ఆ మెరుపు

వెలుతురులో.. చీకటిలో.. 

వెలిగిపోయేనులే.. హే హే.. 

నన్ను కోరేనులే


నా పెదవుల ఫై యీ పిలుపు.. 

హో హో..  

నా హృదయములో నీ తలపు.. 

హ హ

వెలుతురులో.. చీకటిలో.. 

వెలుతురులో 

చీకటిలో  నిలిచి వుండేనులే... 

నిన్ను కోరేనులే        

కౌగిలిలో ఉయ్యాలా 

కన్నులలో జంపాలా

కలసి వూగాలిలే... 

కరిగిపోవాలిలే.. 

తనివి తీరాలిలే 


చరణం 2 :


గులాబీలా విరబూసే నీ సొగసు... 

సెలయేరై చెలరేగేనీ వయసు

అందరిలో ఎందుకనో 

ఆశ రేపేనులే 

అల్లరి చేసేనులే

కసిగా కవ్వించే నీ చూపు...  

జతగా కదిలించే నీ వూపు

రేయైనా..  పగలైనా.. 

రేయైనా..  పగలైనా...

నన్ను మురిపించులే...  

మేను మరిపించులే        

కౌగిలిలో ఉయ్యాలా  

కన్నులలో జంపాలా

కలసి వూగాలిలే...  

కరిగిపోవాలిలే...  

తనివి తీరాలిలే 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు