RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

31, మే 2025, శనివారం

మంచుకొండల్లోన ఎండకాసినట్టు | Manchukondallona | Song Lyrics | Krishnarjunulu (1982)

మంచుకొండల్లోన ఎండకాసినట్టు



చిత్రం: కృష్ణార్జునులు (1982)

సంగీతం: సత్యం

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


మంచుకొండల్లోన ఎండకాసినట్టు

మల్లెపూలు జల్లె ఎన్నెల

పిల్లదాని వాలుకన్నుల

మంచుకొండల్లోన ఎండకాసినట్టు

మల్లెపూలు జల్లె ఎన్నెల

పిల్లదాని వాలుకన్నుల


మంచుకొండల్లోన ఎండకాసినట్టు

మల్లెపూలు జల్లె ఎన్నెల

ఎన్నెలమ్మ ఎండికన్నుల

మంచుకొండల్లోన ఎండకాసినట్టు

మల్లెపూలు జల్లె ఎన్నెల

ఎన్నెలమ్మ ఎండికన్నుల

ఓ ఓ....


చరణం 1:


వెలుతురు తొటలో మిణుగురు పాటలా

వెలుతురు వేణువూదెనే ఎన్నెలా

తిమ్మెర వీణ మీటెనే

వెలుతురు తొటలొ మిణుగురు పాటలా

వెలుతురు వేణువూదెనే ఎన్నెలా

తిమ్మెర వీణ మీటెనే


ఆ నిదరమ్మ ముదరేసె 

కలల అలల వెల్లువలొ


చరణం 2:


వణికిన పెదవులా తొణికిన మధువులా

పొగడలు కొండలాయనే ఎన్నెల

మనుగడ మీగడయెనే

వణికిన పెదవులా తొణికిన మధువులా

పొగడలు కొండలాయనే ఎన్నెల

మనుగడ మీగడయెనే


ఇద్దరయిన ముద్దులమ్మ 

వలపు అలల అల్లికలొ


మంచుకొండల్లోన ఎండకాసినట్టు

మల్లెపూలు జల్లె ఎన్నెల

ఎన్నెలమ్మ ఎండికన్నుల


మంచుకొండల్లోన ఎండకాసినట్టు

మల్లెపూలు జల్లె ఎన్నెల

పిల్లదాని వాలుకన్నుల


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా | Nuvvitta Nenatta | Song Lyrics | Seethamalakshmi (1978)

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా చిత్రం :  సీతామాలక్ష్మి (1978) సంగీతం :  కె.వి. మహదేవన్ గీతరచయిత :  వేటూరి నేపధ్య గానం :  బాలు, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు