RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

28, మే 2025, బుధవారం

కన్నులైనా తెరవనీ ఓ చిన్ని పాపా | Kannulaina Teravani | Song Lyrics | Guduputani (1972)

కన్నులైనా తెరవనీ ఓ చిన్ని పాపా స్వాగతం



చిత్రం :  గూడుపుఠాణి (1972)

సంగీతం :  కోదండపాణి

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  బాలు  


పల్లవి :


కన్నులైనా తెరవనీ 

ఓ చిన్ని పాపా.. స్వాగతం

ఊహలింకా తెలియనీ 

నా చిట్టీ పాపా.. స్వాగతం

ఈ జగానికి స్వాగతం.. 

స్వాగతం.. స్వాగతం  


చరణం 1 : 


లోకమంతా శాంతి చిందిన 

లేగులాబీ లేదులే

మానవతకై ప్రాణమిచ్చిన 

బోసినవ్వే లేదులే

లోకమంతా శాంతి చిందిన 

లేగులాబీ లేదులే

మానవతకై ప్రాణమిచ్చిన 

బోసినవ్వే లేదులే


పూల మాదిరి మెరిసిపోయే 

ముళ్ళ బాటలే మిగిలెనే

నవ్వు చాటున బుసలు కొట్టే 

నాగుపాములె మిగిలెనే

నేటి లోకం అసలు రూపం 

నీవు చూసే దెప్పుడో.. 

నీకు తెలిసే దెన్నడో 


కన్నులైనా తెరవనీ 

ఓ చిన్నిపాపా స్వాగతం

ఊహలింకా తెలియనీ 

నా చిట్టీపాపా స్వాగతం

ఈ జగానికి స్వాగతం.. 

స్వాగతం.. స్వాగతం


చరణం 2 :


జాతి కోసం బలైపోయిన 

నేత నేడిక లేడులే

జగతిలో మనకీర్తి పెంచిన 

విశ్వకవి లేడాయెనే

జాతి కోసం బలైపోయిన 

నేత నేడిక లేడులే

జగతిలో మనకీర్తి పెంచిన 

విశ్వకవి లేడాయెనే


సొంత లాభం కొరకు దేశం 

గొంతు నులిమే ధీరులు

మంచి చేసిన వారి ముంచే 

మనుషులెందరో కలరులే

నేటి లోకం అసలు రూపం 

నీవు చూసే దెప్పుడో 

నీకు తెలిసే దెన్నడో 


కన్నులైనా తెరవనీ 

ఓ చిన్నిపాపా స్వాగతం

ఊహలింకా తెలియనీ 

నా చిట్టీపాపా స్వాగతం

ఈ జగానికి స్వాగతం.. 

స్వాగతం.. స్వాగతం.


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా | Nuvvitta Nenatta | Song Lyrics | Seethamalakshmi (1978)

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా చిత్రం :  సీతామాలక్ష్మి (1978) సంగీతం :  కె.వి. మహదేవన్ గీతరచయిత :  వేటూరి నేపధ్య గానం :  బాలు, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు