RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, ఏప్రిల్ 2025, శనివారం

రామచంద్రుడితడు రఘువీరుడు | Ramachandrudithadu | Song Lyrics | Annamacharya Keerthana

రామచంద్రుడితడు రఘువీరుడు



సాహిత్యం : శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య 

రాగం: ద్విజావంతి

తాళం: ఆది త్రిశ్ర గతి

ఆల్బం : శ్రీరామ గానామృతం 

గానం : పి సుశీల 


పల్లవి :


రామచంద్రుడితడు రఘువీరుడు

కామిత ఫలములీయ గలిగెనిందరికి


చరణం 1 :


గౌతము భార్యపాలిటి కామధేనువితడు

ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము

సీతాదేవి పాలిటి చింతామణి యితడు

యీతడు దాసుల పాలిటి యిహపర దైవము


చరణం 2 :


పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు

సరిహనుమంతుపాలి సామ్రాజ్యము

నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు

గరిమజనకు పాలి ఘనపారిజాతము


చరణం 3 :


తలప శబరిపాలి తత్వపు రహస్యము

అలరిగుహునిపాలి ఆదిమూలము

కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి

వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి చిత్రం : దానధర్మాలు (1976) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్  నేపధ్య గానం : ఎస్ పి బాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు