RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, ఏప్రిల్ 2025, గురువారం

ఓదార్పుకన్న చల్లనిది | Odarpukanna Challanidi | Song Lyrics | Amarajeevi (1983)

ఓదార్పుకన్న చల్లనిది



చిత్రం: అమరజీవి (1983) 

సంగీతం: చక్రవర్తి 

గీతరచయిత: వేటూరి 

నేపథ్య గానం: బాలు, జానకి 


పల్లవి : 


ఓదార్పుకన్న చల్లనిది.. 

నిట్టూర్పుకన్న వెచ్చనిది 

గగనాలకన్న మౌనమిది.. 

అర్చనగా..ద ద ద ని 

అర్పనగా.. ని ద ని స.. దీవెనగా.. 

లాలనగా.. వెలిగే ప్రేమ 


ఓదార్పుకన్న చల్లనిది.. 

నిట్టూర్పుకన్న వెచ్చనిది 

గగనాలకన్న మౌనమిది.. 

అర్చనగా..ద ద ద ని 

అర్పనగా.. ని ద ని స.. దీవెనగా.. 

లాలనగా.. వెలిగే ప్రేమ 


చరణం 1: 


వేదాలకైన మూలమది.. 

నాదాలలోన భావమది 

దైవాలకైన ఊయలది.. 

కాలాలకన్న వేదమది 

కన్నీళ్ళు మింగి బ్రతికేది.. 

అదిలేనినాడు బ్రతుకేది 

నీకై జీవించి.. 

నిన్నే దీవించి.. 

నీకై మరణించు.. 

జన్మజన్మల ఋణమీ ప్రేమ 


ఓదార్పుకన్న చల్లనిది.. 

నిట్టూర్పుకన్న వెచ్చనిది 

గగనాలకన్న మౌనమిది.. 

అర్చనగా..ద ద ద ని 

అర్పనగా.. ని ద ని స.. దీవెనగా.. 

లాలనగా.. వెలిగే ప్రేమ 


చరణం 2 : 


లయమైన సృష్టి కల్పములో.. 

చివురించు లేత పల్లవిది 

గతమైనగాని రేపటిది.. 

అమ్మలనుగన్న అమ్మ ఇది 

పూలెన్ని రాలిపోతున్నా.. 

పులకించు ఆత్మగంధమిది 

నిన్నే ఆశించి.. 

నిన్నే సేవించి.. 

కలలే అర్పించు.. 

బ్రతుకు చాలని బంధం ప్రేమ 


ఓదార్పుకన్న చల్లనిది.. 

నిట్టూర్పుకన్న వెచ్చనిది 

గగనాలకన్న మౌనమిది.. 

అర్చనగా..ద ద ద ని 

అర్పనగా.. ని ద ని స.. దీవెనగా.. 

లాలనగా.. వెలిగే ప్రేమ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు