RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, ఏప్రిల్ 2025, శనివారం

జయ జయ రామా సమరవిజయ రామా | Jaya Jaya Rama | Song Lyrics | Annamacharya Keerthana

జయ జయ రామా సమరవిజయ రామా



సాహిత్యం : శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య 

ఆల్బం : శ్రీరామ గానామృతం 

గానం : ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 


పల్లవి :


జయ జయ రామా సమరవిజయ రామా

భయహర నిజభక్తపారీణ రామా


చరణం 1 :


జలధి బంధించిన సౌమిత్రిరామా

సెలవిల్లు విరిచిన సీతారామా

అలసుగ్రీవునేలిన అయోధ్యరామా

కలగి యజ్ఞముగాచే కౌసల్యరామా


చరణం 2 :


అరిరావణాంతక ఆదిత్యకులరామా

గురుమౌనులను గాచే కోదండరామా

ధర నహల్యపాలిటి దశరథరామా

హరురాణినుతుల లోకాభిరామా


చరణం 3 :


అతిప్రతాపముల మాయామృగాంతక రామా

సుతకుశలవప్రియ సుగుణ రామా

వితత మహిమల శ్రీవేంకటాద్రిరామా

మతిలోన బాయని మనువంశ రామా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

థంబ్స్ అప్ థండర్ కైనా | Thumsup Thunder | Song Lyrics | Jai Chiranjeeva (2005)

థంబ్స్ అప్ థండర్ కైనా చిత్రం : జై చిరంజీవ (2005) సంగీతం : మణిశర్మ గీతరచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ  నేపధ్య గానం :  మహాలక్ష్మి అయ్యర్,...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు