RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, ఏప్రిల్ 2025, శనివారం

నడిరేయి ఏ జాములో | Nadireyi ye Jamulo | Song Lyrics | Rangula Ratnam (1966)

నడిరేయి ఏ జాములో



చిత్రం :  రంగులరాట్నం (1966)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  ఘంటసాల,  జానకి 


పల్లవి :


నడిరేయి ఏ జాములో.. 

స్వామి నిను చేర దిగివచ్చునో

తిరుమల శిఖరాలు దిగివచ్చునూ...


నడిరేయి ఏ జాములో.. 

స్వామి నిను చేర దిగివచ్చునో

తిరుమల శిఖరాలు దిగివచ్చునూ 


చరణం 1 :


మముగన్న మాయమ్మ 

అలివేలు మంగమ్మ

మముగన్న మాయమ్మ 

అలివేలు మంగమ్మ

పతి దేవు ఒడిలోన 

మురిసేటివేళా


స్వామి చిరునవ్వు వెన్నెలలు 

కురిసేటివేళా

విభునికి మా మాట వినిపించవమ్మా

ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా 


చరణం 2 :


ఏడెడు శిఖరాలు నే నడువలేను .. 

ఏ పాటి కానుకలందించలేను

వెంకన్న పాదాలు దర్శించలేను... 

నేను వివరించి నా బాధ వినిపించలేను


అమ్మా..ఆ..ఆ..ఆ.. మము గన్న 

మాయమ్మా అలివేలుమంగా

మము గన్న మాయమ్మా అలివేలుమంగా

విభునికి మా మాట వినిపించవమ్మా

ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా 


చరణం 3 :


కలవారినేగాని కరుణించలేడా..  

నిరుపేద మొరలేవి వినిపించుకోడా

కన్నీటి బ్రతుకుల కనలేనినాడు.. 

స్వామి కరుణామయుండన్నా 

బిరుదేలనమ్మా

అడగవే మా తల్లి అనురాగ వల్లి .. 

అడగవె మాయమ్మ అలివేలుమంగా


నడిరేయి ఏ జాములో..  

స్వామి నిను చేర దిగివచ్చునో

తిరుమల శిఖరాలు దిగివచ్చునూ...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు