RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

31, డిసెంబర్ 2025, బుధవారం

పూజకు వేళాయెరా | Poojaku Velayera | Song Lyrics | Bhakta Tukaram (1973)

పూజకు వేళాయెరా


చిత్రం : భక్త తుకారాం (1973)

సంగీతం : ఆదినారాయణరావు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి  

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :


పూజకు వేళాయెరా...

రంగపూజకు వేళాయెరా... ఆ...

పూజకు వేళాయెరా...


అనుపల్లవి :


ఇన్నినాళ్లు నే నెటుల వేచితినో

ఎన్ని రేలు ఎంతెంత వేగితినో

ఇన్నినాళ్లు నే నెటుల వేచితినో

ఎన్ని రేలు ఎంతెంత వేగితినో


పిలుపును విని విచ్చేసితివని

నా పిలుపును విని విచ్చేసితివని

వలపులన్నీ నీ కొరకె దాచితిని    

వలపులన్నీ నీ కొరకె దాచితిని

ఎవరూ పొందని ఏకాంతసేవలో...

ఈవేళ తమిదీరగా నిన్నె అలరించు...

పూజకు వేళాయె...

పూజకు వేళాయెరా...


చరణం 1 :


ఈ నీలినీలి ముంగురులు... 

ఇంద్రనీలాల మంజరులు

ఈ వికసిత సిత నయనాలు... 

శతదళ కోమల కమలాలు

అరుణారుణమీ అధరము... 

తరుణమందార పల్లవము

ఎదలో పొంగిన ఈ రమణీయ 

పయోధరాలు...

పాలకడలిలో ఉదయించు 

సుధాకలశాలు...

ఎంత సుందరము 

శిల్ప బంధురము

ఈ... జఘన మండలము...

సృష్టినంతటిని దాచుకున్న 

ఆ పృథివీ మండలము


ఓ... అభినవ సౌందర్యరాశీ...

ఓ... అపూర్వ చాతుర్యమూర్తీ...

నీ కటాక్షముల లాలనమ్ములో...

నీ మధురాధర చుంబనమ్ములో...

 నీ కటాక్షముల లాలనమ్ములో...

నీ మధురాధర చుంబనమ్ములో...

మధురిమలెన్నో పొదుగుకున్న

నీ స్తన్య సుధల ఆస్వాదనమ్ములో....

అప్రమేయ దివ్యానందాలను 

అందించే నీ చల్లని ఒడిలో

హాయిగా నిదురించ గలిగే...

పాపగా నీ కడుపున 

జన్మించు భాగ్యమే

లేదాయె తల్లీ... తల్లీ.... తల్లీ...


స్వామీ....

అవునమ్మా నీవు ప్రదర్శించిన

సౌందర్యం అనిత్యం

నీవు నమ్ముకున్న 

యవ్వనం అశాశ్వతం..


దువ్వుకున్న ఆ నీలిముంగురులె 

దూదిపింజలై పోవునులే

నవ్వుతున్న ఆ కంటి వెలుగులే 

దివ్వెల పోలిక ఆరునులే

వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే 

వాడి వక్కలై పోవునులే

పాలుపొంగు ఆ కలశాలే 

తోలుతిత్తులై పోవునులే

నడుము వంగగా నీ ఒడలు కుంగగా...

నడుము వంగగా ఒడలు కుంగగా...

నడువలేని నీ బడుగు జీవితం... 

వడవడ వణకునులే

ఆశలు రేపే సుందర దేహము 

అస్థిపంజరంబౌనులే...


పాండురంగ హరి జైజై..

పాండురంగ హరి ..

పాండురంగ హరి జైజై..

పాండురంగ హరి ..

పాండురంగ హరి జైజై..

పాండురంగ హరి

పాండురంగ హరి జైజై..

పాండురంగ హరి

విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ

విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ

విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ 

విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ


విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ 


- పాటల ధనుస్సు 


ఉన్నావా అసలున్నావా | Unnava Asalunnava | Song Lyrics | Bhakta Tukaram (1973)

ఉన్నావా... అసలున్నావా


చిత్రం : భక్త తుకారాం (1973)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


ఉన్నావా... అసలున్నావా

ఉంటే కళ్ళుమూసుకున్నావా... 

ఈ లోకం కుళ్ళు చూడకున్నవా

ఉన్నావా... అసలున్నావా

ఉంటే కళ్ళుమూసుకున్నావా... 

ఈ లోకం కుళ్ళు చూడకున్నవా  


ఉన్నావని కనుగొన్నామని 

మున్నెందరెందరో అన్నారు

ఉన్నావని చూస్తున్నావని 

నమ్మి ఎందరో ఉన్నారు

ఉన్నావా... అసలున్నావా


చరణం 1 :


నీ పేరిట వంచన పెరుగుతువుంటే... 

నీ ఎదుటే హింసలు జరుగుతు వుంటే

మనిషిని మనిషి దోస్తూవుంటే... 

మంచికి సమాధి కడుతూ వుంటే

రాతి బొమ్మవై నిలిచావు.. 

చాతగాని వాడనిపించావు

ఉన్నావా... అసలున్నావా


చరణం 2 :


నీ భక్తుడ నయ్యాను.. 

నిత్య దరిద్రుడనయ్యాను

నీ భక్తుడ నయ్యాను.. 

నిత్య దరిద్రుడనయ్యాను

సేవలు చేశాను.. 

నా బ్రతుకే నైవేద్యం చేశాను

చేసిన మేలునుమరిచేవాడా.. 

నువ్వా దేవుడివి.. నువ్వొక వ్యర్థుడివి

నీకొక పేరూ లేదు.. రూపం లేదు ..

నీతి లేదు.. నియమం లేదు.. 

నిజానికి నువ్వే లేవు..  

లేవు.. లేవు.. లేవు


- పాటల ధనుస్సు 


భలే భలే అందాలు సృష్టించావు | Bhale Bhale Andalu | Song Lyrics | Bhakta Tukaram (1973)

భలే భలే అందాలు సృష్టించావు


చిత్రం : భక్త తుకారాం (1973)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత : వీటూరి

నేపధ్య గానం :  ఘంటసాల


సాకి : 


ఆ...  నందన వనముగ

ఈ లోకమునే సృష్టించిన

ఓ...  వనమాలి

మరచితివో మానవజాతిని 

దయమాలి..


పల్లవి :


భలే భలే అందాలు సృష్టించావు...  

ఇలా మురిపించావు

అదే ఆనందం అదే అనుబంధం...  

ప్రభో మాకేల ఈయవు

భలే భలే అందాలు సృష్టించావు... 


చరణం 1 :


మాటలు రాని మృగాలు సైతం..  

మంచిగ కలసి జీవించేను

మాటలు నేర్చిన మా నరజాతి.. 

మారణహోమం సాగించేను


మనిషే పెరిగి మనసే తరిగి..

మనిషే పెరిగి మనసే తరిగి.. 

మమతే మరచాడు మానవుడు

నీవేల మార్చవు?


భలే భలే అందాలు సృష్టించావు...  

ఇలా మురిపించావు

అదే ఆనందం అదే అనుబంధం...  

ప్రభో మాకేల ఈయవు

భలే భలే అందాలు సృష్టించావు..


చరణం 2 :


ఆ...ఆ... ఆ... ఆ...ఆ..ఆ...ఆ... 

ఆ... ఆ...ఆ..

చల్లగ సాగే సెలయేటి ఓలే.. 

మనసే నిర్మలమై వికసించాలి

గుంపుగ ఎగిరే గువ్వల ఓలే.. 

అందరు ఒక్కటై నివసించాలి


స్వార్ధం మానుకొని 

సమతే పెంచుకొని..

స్వార్ధం మానుకొని 

సమతే పెంచుకొని.. 

మంచిగ మానవుడే మాధవుడై

మహిలోన నిలవాలి


భలే భలే అందాలు సృష్టించావు..  

ఇలా మురిపించావు

అదే ఆనందం అదే అనుబంధం..  

ప్రభో మాకేల ఈయవు

భలే భలే అందాలు సృష్టించావు..


- పాటల ధనుస్సు 


వేస్తాను పొడుపు కథా | Vestanu Podupu Katha | Song Lyrics | Andaman Ammayi (1979)

వేస్తాను పొడుపు కథా


చిత్రం :  అండమాన్ అమ్మాయి (1979)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  సుశీల, బాలు


పల్లవి :


వేస్తాను పొడుపు కథా...  వేస్తాను

చూస్తాను విప్పుకో... చూస్తాను


మనం వేసుకొన్న 

పొడుపు కథా ఈ రాత్రి

అది విప్పుకొని తప్పుకొంటే 

శివరాత్రి


వేస్తాను పొడుపు కథా...  వేస్తాను

చూస్తాను విప్పుకో... చూస్తాను


మనం వేసుకొన్న 

పొడుపు కథా ఈ రాత్రి

అది విప్పుకొని 

తప్పుకొంటే శివరాత్రి


చరణం 1 :


వచ్చాక వచ్చారు... 

వచ్చి వెళ్ళిపోయరు

వెళ్ళి మళ్ళి వచ్చారు... 

మళ్ళి వెళ్తే వస్తారా

వచ్చాక వచ్చారు... 

వచ్చి వెళ్ళిపోయరు

వెళ్ళి మళ్ళి వచ్చారు... 

మళ్ళి వెళ్తే వస్తారా... ఆ

ఎవరు వారు? ... 

ఎవరు వారు?


తెలిలా... ఉ..

ఇంకా తెలిలే.. ఊహూ...తెలిలా

ఈ... పళ్ళూ... 


హేయ్.. ఓడిపోయావ్.. 

ఓడిపోయావ్... ఆ...హహహాహా


వేస్తాను పొడుపు కథా...  వేస్తాను

చూస్తాను విప్పుకో... చూస్తాను

మనం వేసుకొన్న 

పొడుపు కథా ఈ రాత్రి

అది విప్పుకొని 

తప్పుకొంటే శివరాత్రి


చరణం 2 :


పగడాలా చక్రాల 

పచ్చని తేరునెక్కి

సూర్యుడంటి వీరుడొస్తే... 

దారంతా నెత్తురంటా

పగడాలా చక్రాల 

పచ్చని తేరునెక్కి

సూర్యుడంటి వీరుడొస్తే... 

దారంతా నెత్తురంటా


ఏమిటంటా? ... ఏంటబ్బా?

ఊ.. తెలీలా... ఊహూ...

ఇదీ తెలీలేదా... ఊహూ...


వక్కా... ఆకు... సున్నం...

ఆకు... వక్కా... సున్నం...

హహాహా


వేస్తాను పొడుపు కథా...  వేస్తాను

చూస్తాను విప్పుకో... చూస్తాను


మనం వేసుకొన్న 

పొడుపు కథా ఈ రాత్రి

అది విప్పుకొని 

తప్పుకొంటే శివరాత్రి


చరణం 3 :


పుట్టినిల్లు మెట్టినిల్లు ఒక్కటైనవి...

పుట్టిన ప్రతి జీవికి తప్పకున్నవి

పుట్టినిల్లు మెట్టినిల్లు ఒక్కటైనవి...

పుట్టిన ప్రతి జీవికి తప్పకున్నవి


కాయైనా.. పండైనా...

కాయైనా పండైనా తియ్యనైనవి

గాయమైనా మందైనా తానైనది

ఏవిటదీ? ... ఏవిటబ్బా?


తెలీలా...ఊహూ...

ఇంకా తెలీలా... తెలీలా... హహా

ప్రేమా....


ఏయ్... ఓడిపోయావ్.. 

ఓడిపోయావ్... హహా


వేస్తాను పొడుపు కథా... వేస్తాను

చూస్తాను విప్పుకో... చూస్తాను


మనం వేసుకొన్న 

పొడుపు కథా ఈ రాత్రి

అది విప్పుకొని 

తప్పుకొంటే శివరాత్రి


చరణం 4 :


నేల మీద నిలిచేది రెండు కాళ్ళు

నింగిలోన నిలిచేవి రెండు కాళ్ళు

మధ్యలో నడిచేవి ఎన్నో కాళ్ళు  


నేల మీద నిలిచేది రెండు కాళ్ళు

నింగిలోన నిలిచేవి రెండు కాళ్ళు

మధ్యలో నడిచేవి ఎన్నో కాళ్ళు


ఏవిటది? ... ఆ.. ఏవిటది?

తెలీలా..ఊహూ.. తేలీలా... అహా


హేయ్.. నాకూ తెలీదు...

నీకూ తెలీదు... 

అయితే ఓడిపోయావ్... ఏవీ లేదు...

నువ్వే ఓడిపొయావ్.. 

మీరే ఓడిపోయారు...హహాహా


- పాటల ధనుస్సు 



చిత్రచిత్రాల బొమ్మా | Chitra Chitrala Bomma | Song Lyrics | Andaman Ammayi (1979)

చిత్రచిత్రాల బొమ్మా


చిత్రం :  అండమాన్ అమ్మాయి (1979)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం  :  సుశీల, బాలు


పల్లవి :


చిత్రచిత్రాల బొమ్మా 

పుత్తడి పోత బొమ్మా

అహా... చిత్రచిత్రాల బొమ్మా 

పుత్తడి పోతబొమ్మ

మెత్తామెత్తాంగ వచ్చి 

చిత్తాన్నే దోచెనమ్మా... ఆ.. ఆ

చిత్రచిత్రాల బొమ్మా 

పుత్తడి పోత బొమ్మా


పైలాపచ్చీసు బొమ్మా.. 

పరదేశి ఆటబొమ్మా

అహా... పైలాపచ్చీసు బొమ్మా.. 

పరదేశి ఆటబొమ్మా

ముచ్చల్లే వచ్చి వచ్చి 

మత్తేదో చల్లెనమ్మా

పైలాపచ్చీసు బొమ్మా.. 

పరదేశి ఆటబొమ్మా


చరణం 1 :


టేకు మానల్లే చల్లంగ ఉంటాడు... 

ఆకుతేలల్లే వస్తాడు

టేకు మానల్లే చల్లంగ ఉంటాడు... 

ఆకుతేలల్లే వస్తాడు

సోకంతా చూపుల్లో చూపుతాడు... 

ఆ చూపులతో ఒళ్ళంతా పాకుతాడు

అరెరరె...

పువ్వు తీగల్లే నాజూగ్గా ఉంటుంది... 

బొండుమల్లెల్లే నిండుగా నవ్వుతుంది

పువ్వు తీగల్లే నాజూగ్గా ఉంటుంది... 

బొండుమల్లెల్లే నిండుగా నవ్వుతుంది

నవ్వుల్లో  బాణాలు రువ్వుతుంది... 

రువ్వుతూ ప్రాణాలు తోడుతుంది


చిత్రచిత్రాల బొమ్మా 

పుత్తడి పోత బొమ్మా

మెత్తామెత్తాంగ వచ్చి 

చిత్తాన్నే దోచెనమ్మా... ఆ.. ఆ

పైలాపచ్చీసు బొమ్మా.. 

పరదేశి ఆటబొమ్మా


చరణం 2 :


వాడిబాకల్లే గుచ్చుతుంది గుండెలో... 

లేడిపిల్లల్లే గెంతుతుంది ఇంతలో

వాడిబాకల్లే గుచ్చుతుంది గుండెలో... 

లేడిపిల్లల్లే గెంతుతుంది ఇంతలో

దీపమల్లె వెలుగుతుంది దీవిలో.. 

తెరచాపలాగ ఎగురుతుంది నావలో


ఆ.. అలలు అలలుగా 

ఊగుతాడు మనసులో... 

కలలు కలలుగా వస్తాడు కళ్ళలో

అలలు అలలుగా 

ఊగుతాడు మనసులో... 

కలలు కలలుగా వస్తాడు కళ్ళలో

కడలిలాగా ఉంటాడు లోతులో... 

చెలమలాగ ఊరుతాడు చెలిమిలో


పైలాపచ్చీసు బొమ్మా.. 

పరదేశి ఆటబొమ్మా

ముచ్చల్లే వచ్చి వచ్చి 

మత్తేదో చల్లెనమ్మా

పైలాపచ్చీసు బొమ్మా.. 

పరదేశి ఆటబొమ్మా

అరెరె.. చిత్రచిత్రాల బొమ్మా 

పుత్తడి పోతబొమ్మా


- పాటల ధనుస్సు 


పైరగాలి వయసు పదహారే | Pyragali Vayasu Padahare | Song Lyrics | Prayanamlo Padanisalu (1978)

పైరగాలి వయసు పదహారే


చిత్రం:  ప్రయాణంలో పదనిసలు (1978)

సంగీతం:  శంకర్-గణేష్

గీతరచయిత:  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం:  సుశీల, రామకృష్ణ


పల్లవి :


పైరగాలి వయసు పదహారే...

ఎపుడు పదహారే...

చందమామ సొగసు జలతారే..ఓహ్..

ఎపుడు.. జలతారే


పైరగాలి వయసు పదహారే... 

పదహారే

చందమామ సొగసు జలతారే... 

జలతారే


ఆ గాలిలో చెలి మనసే చిగురాకు

ఆ వెన్నెలలో తొలి వలపే కలువరేకు

ల...ల..ల..లా..

ఆ గాలిలో చెలి మనసే చిగురాకు

ఆ వెన్నెలలో తొలి వలపే కలువరేకు


పైరగాలి వయసు పదహారే... 

పదహారే

చందమామ సొగసు జలతారే... ఓహ్.. 

జలతారే


చరణం : 1


నింగిని వదలి మెరుపు తీగ 

నేలకు దిగుతున్నదా?..ఆ..

నింగిని వదలి మెరుపు తీగ 

నేలకు దిగుతున్నదా?..ఆ..

తీగను విడిచి లేతగులాబి...

తీగను విడిచి లేతగులాబి... 

సాగి వస్తున్నదా?

సాగి వస్తున్నదా?


మబ్బుని వదిలి మెరుపుంటుందా.. 

నీడను విడిచి పూవుంటుందా

మబ్బుని వదిలి మెరుపుంటుందా.. 

నీడను విడిచి పూవుంటుందా

నీవు లేనిదే నేనుంటానా..

నీవు లేనిదే నేనుంటానా... 

నేనుంటానా... నేనుంటానా..


పైరగాలి వయసు పదహారే... 

పదహారే

చందమామ సొగసు జలతారే... ఓహ్.. 

జలతారే


చరణం : 2


లల..లాలా..హేహే..

హేహే..లలలా..లా


నీ గొంతుకలో రాగం పుడితే.. 

నా మనసే కోయిలా

నీ గొంతుకలో రాగం పుడితే.. 

నా మనసే కోయిలా

నీ ఎదలోనా గిలిగింతైతే...

నీ ఎదలోనా గిలిగింతైతే...  

నా బ్రతుకే ఊయలా..

 నా బ్రతుకే ఊయలా...


ఏటికి నీటికి కుదిరిన బంధం... 

గాలికి తావికి కలిసిన బంధం

ఏటికి నీటికి కుదిరిన బంధం... 

గాలికి తావికి కలిసిన బంధం

మన ఇరువురిని కలిపిన బంధం

మన ఇరువురిని కలిపిన బంధం ... 

ఈ అనుబంధం ... ఈ అనుబంధం


పైరగాలి వయసు పదహారే... 

పదహారే

చందమామ సొగసు జలతారే... 

ఓహ్.. జలతారే


ఆ గాలిలో చెలి మనసే చిగురాకు

ఆ వెన్నెలలో తొలి వలపే కలువరేకు


ఆహా.. హెహెహేహే...

లలలలల.. లాలా..


- పాటల ధనుస్సు 



29, డిసెంబర్ 2025, సోమవారం

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో | Virisina Vennelavo | Song Lyrics | Bandipotu Dongalu (1968)

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో


చిత్రం: బందిపోటు దొంగలు (1968)

సంగీతం: పెండ్యాల

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి:


విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో

తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో …

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో

తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో

విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …


చరణం 1:


సిగలో గల జాబిల్లి 

చిరునగవులు చిందగా.. 

ఆ... ఆ... ఆ...

సిగలో గల జాబిల్లి 

చిరునగవులు చిందగా..

అడుగడుగున హంసలు 

ఒయ్యారము లొలుకగా

వెదికే పెదవులతో .. 

తొణికే మధువులతో..

వెదికే పెదవులతో .. 

తొణికే మధువులతో

పొందుగోరి చెంతజేరి 

మురిపించే నా చెలీ …


విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో

తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో

విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …


చరణం 2:


కరుణలేని శిలనైనా 

కరిగించే నవ్వుతో.. 

ఓ.. ఓ.. ఓ.. ఓ...

కరుణలేని శిలనైనా 

కరిగించే నవ్వుతో..

ముల్లునైన మల్లియగా 

మలచే కనుదోయితో

నడిచే తీగియవై.. 

పలికే దీపికవై..

నడిచే తీగియవై... 

పలికే దీపికవై..

అవతరించి ఆవరించి 

అలరించే నా చెలీ ..


విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో

తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో

విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …


- పాటల ధనుస్సు 


కిలాడి దొంగా డియో డియో | Killadi Donga Diyo Diyo | Susheela | Song Lyrics | Bandipotu Dongalu (1968)

కిలాడి దొంగా డియో డియో


చిత్రం : బందిపోటు దొంగలు (1968)

సంగీతం : పెండ్యాల

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : పి.సుశీల 



పల్లవి : 


ఏయ్ కిలాడీ..

కిలాడి దొంగా..డియో డియో

నీ లలాయి బూటకం..డియో డియో

కిలాడి దొంగా..డియో డియో

నీ లలాయి బూటకం..డియో డియో


చరణం 1 : 


వాలింది పుట్టపై వల్లంకిపిట్టే

దాన్నిపట్టాగ ఎక్కావు..మొనగా చెట్టే

ఆ..వాలింది పుట్టపై వల్లంకిపిట్టే

దాన్నిపట్టాగ ఎక్కావు..మొనగా చెట్టే  


గుండెలో ఏదేదో..గుబులు పుట్టింది..

ఈ..ఈ..హోయ్

అణిచితే అదికాస్త..అడ్డుతిరిగింది..

అహాహాహాహా


కిలాడి దొంగా..డియో డియో

నీ లలాయి బూటకం..డియో డియో        


చరణం 2 :


మెత్తమెత్తని వాడా..మేనత్తకొడుకా

కత్తిపూవుగమారే..కంగారుపడక

మెత్తమెత్తని వాడా..మేనత్తకొడుకా

కత్తిపూవుగమారే..కంగారుపడక

వన్నెచిన్నెలు  దోచ..వలవేయనేల

కన్నె వలపందుకో..కన్నయ్యదొంగా..ఆ 


కిలాడి దొంగా..డియో డియో

నీ లలాయి బూటకం..డియో డియో


చరణం 3 :


వేషాలు వేసేవు..వెర్రి నారాజా

నీ వేషాలు వెలితిగా..వెల్లడైపోయే

హా హా హా హా హా హా ఆ

వేషాలు వేసేవు..వెర్రి నారాజా

వేషాలు వెలితిగా..వెల్లడైపోయే

తెలుసుకో ఓరయ్యో..

తెలుసుకో మనసు

అహా ఉహు అహా ఉహు 

అహా ఉహు అహా ఉహు

తెలుసుకో తెలుసుకో తెలుసుకో..

మనసు

నీ..ఈ..టెంపరి తనమంత..

తెల్లారిపోయే


కిలాడి దొంగా..డియో డియో

నీ లలాయి బూటకం..డియో డియో

నీ లలాయి బూటకం..డియో డియో


- పాటల ధనుస్సు 


కిలాడి దొంగా డియో డియో | Killadi Donga Diyo Diyo | Ghantasala | Song Lyrics | Bandipotu Dongalu (1968)

కిలాడి దొంగా డియో డియో


చిత్రం :  బందిపోటు దొంగలు (1968)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం :  ఘంటసాల 


పల్లవి : 


కిలాడి దొంగా డియో డియో

నీ లొల్లాయి అల్లరికీ డియో డియో

కిలాడి దొంగా డియో డియో

నీ లొల్లాయి అల్లరికీ డియో డియో


చరణం 1 : 


వాలింది పుట్టపై వల్లంకిపిట్ట

దాని వయ్యారమంతా..

వలవేసి పట్టా

వాలింది పుట్టపై వల్లంకిపిట్ట

దాని వయ్యారమంతా..

వలవేసి పట్టా

గుండెలో ఏదేదో..

గుబులు పుట్టింది..ఈ.. ఈ..హోయ్

గుండెలో ఏదేదో..గుబులు పుట్టింది

ఎంత అణచినా అది..

ఎగిరెగిరి పడుతుంది


ఓహోహో..కిలాడి దొంగా 

డియో డియో

నీ లొల్లాయి అల్లరికీ డియో డియో

   

చరణం 2 :


సిన్నమ్మీ నీ సొగసు..సిరిమల్లె సెట్టు

సిరిమల్లెసెట్టేమో..చితకబూసింది

సిన్నమ్మీ నీ సొగసు..సిరిమల్లెసెట్టు

సిరిమల్లెసెట్టేమో..

చితకబూసింది

చెట్టుకదలాకుండా..

కొమ్మవంచాకుండా

పట్టడేసీపూలు..

పట్టుకెళ్ళమంటావు..

ఆహహహ


కిలాడి దొంగా డియో డియో

నీ లలాయి అల్లరికీ డియో డియో


చరణం 3 :


దోబూచులాడేవు..

దొరసాని పిల్లా..ఆ..ఆ..హోయ్

దోబూచులాడేవు..దొరసాని పిల్లా

తోటవాకిలికాడ..ఆ..దొంగలున్నారు

దాచుకోబుల్లెమ్మ..దాచుకో నీ వయసు

అహా..ఉహూ..అహా..ఉహూ..

అహా..ఉహూ..అహా..ఉహూ

దాచుకో..దాచుకో..దాచుకో..బుల్లెమ్మ

దాచుకోమంటేను..దోచి దోచి పెడతావా


కిలాడి దొంగా డియో డియో

నీ లలాయి అల్లరికీ డియో డియో

నీ లలాయి అల్లరికీ డియో డియో


- పాటల ధనుస్సు 


సన్నజాజికి గున్నమావికి | Sannajajiki Gunnamaviki | Song Lyrics | Mutyala Pallaki (1976)

సన్నజాజికి గున్నమావికి


చిత్రం : ముత్యాల పల్లకి (1976)

సంగీతం : సత్యం

గీతరచయిత : మల్లెమాల

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి:


సన్నజాజికి గున్నమావికి 

పెళ్లి కుదిరిందీ...

మాటామంతి లేని వేణువు 

పాట పాడిందీ..

సన్నజాజికి గున్నమావికి 

పెళ్లి కుదిరిందీ...

మాటామంతి లేని వేణువు 

పాట పాడిందీ..


హా..హా...హా....ఆ హా...హా

గున్న మావికి సన్నజాజికి 

పెళ్లి కుదిరింది..

నాదే గెలుపని మాలతీలతా 

నాట్యమాడిందీ..

సన్నజాజికి గున్నమావికి 

పెళ్లి కుదిరిందీ...

మాటామంతి లేని వేణువు 

పాట పాడిందీ..

 

ఆహా..ఆహా....ఓహో... ఓహో..


చరణం 1:


పూసే వసంతాలు మా కళ్ళలో

పూలే తలంబ్రాలు మా పెళ్లిలో

పూసే వసంతాలు మా కళ్ళలో

పూలే తలంబ్రాలు మా పెళ్లిలో

విరికొమ్మా చిరురెమ్మా..

విరికొమ్మా చిరురెమ్మా..

పేరంటానికి రారమ్మా

సన్నజాజికి గున్నమావికి 

పెళ్లి కుదిరిందీ...

మాటామంతి లేని వేణువు 

పాట పాడిందీ..

 

ఆహా..ఆహా...

హా..హా..హా...ఆ...హా...హా...

 

చరణం 2:


కలలే నిజాలాయే ఈనాటికీ

అలలే స్వరాలాయే మా పాటకీ

కలలే నిజాలాయే ఈనాటికీ

అలలే స్వరాలాయే మా పాటకీ


శ్రీరస్తూ శుభమస్తూ...

శ్రీరస్తూ శుభమస్తూ

అని మీరు మీరు దీవించాలీ

 

సన్నజాజికి గున్నమావికి 

పెళ్లి కుదిరిందీ..

నాదే గెలుపని మాలతీలతా 

నాట్యమాడిందీ..

సన్నజాజికి గున్నమావికి 

పెళ్లి కుదిరిందీ


- పాటల ధనుస్సు 


దోర నిమ్మపండులాగ ఊరించే | Dora Nimmapandulaga Oorinche | Song Lyrics | Chikkadu Dorakadu (1967)

దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని


చిత్రం: చిక్కడు దొరకడు (1967) 

సంగీతం: టి.వి. రాజు 

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 


పల్లవి: 


దోర నిమ్మపండులాగ 

ఊరించే దొరసాని 

దోచుకోనా నీ పరువం ...

దాచలేనే ఈ విరహం 


చరణం 1: 


పూలలోన సోయగాలు 

పొంగిపోయే నీలోన 

నింగిలోని చందమామ 

తొంగి చూసె నీలోన 


మెరుపులోని చురుకుదనాలు 

మెరిసిపోయె నీలోన 

మెరుపులోని చురుకుదనాలు 

మెరిసిపోయె నీలోన 

మరులొలికే నీ మగసిరి చూసి 

కరిగిపోదును లోలోనా 


దోర నిమ్మపండులాగ 

ఊరించే దొరసాని 

దోచుకోనా నీ పరువం... 

దాచలేనే ఈ విరహం 


చరణం 2: 


మేనిలోన వీణలేవో 

మెలమెల్లగ పలికినవి 

మనసులోన తేనెలేవో 

సనసనాగ ఒళికినవి 


నన్ను నీవు తాగగానే 

నడిరాతిరి నవ్వింది 

నన్ను నీవు తాగగానే 

నడిరాతిరి నవ్వింది 

వగలులూరే నీ నగవులు దాగే 

వలపు బాస తెలిసింది 


దోర నిమ్మపండులాగ 

ఊరించే దొరగారు 

దోచుకో ఇక నా పరువం... 

దాచుటెందుకు నీ విరహం


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు