RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

29, డిసెంబర్ 2025, సోమవారం

కనులీవేళ చిలిపిగ నవ్వెను | Kanuleevela Chilipiga | Song Lyrics | Mangamma Sapatham (1965)

కనులీవేళ చిలిపిగ నవ్వెను



చిత్రం : మంగమ్మ శపధం (1965)

సంగీతం : టి.వి. రాజు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


కనులీవేళ చిలిపిగ నవ్వెను

మనసేవేవో వలపులు రువ్వెను

చెలి... నా చెంత నీకింత జాగేలనే

చెలి... నా చెంత నీకింత జాగేలనే

కనులీవేళ చిలిపిగ నవ్వెను..

మనసేవేవో వలపులు రువ్వెను..

ఇక అందాల ఉయ్యాల లూగింతులే

ఇక అందాల ఉయ్యాల లూగింతులే


చరణం 1:


మధుర శృంగార మందార మాల.. 

కదలి రావేల కలహంస లీల

మధుర శృంగార మందార మాల.. 

కదలి రావేల కలహంస లీల


రంగు రంగుల బంగారు చిలకా...

రంగు రంగుల బంగారు చిలక... 

వలచి నీ ముందు వాలిందిలే..ఏ ఏ....


కనులీవేళ చిలిపిగ నవ్వెను... 

మనసేవేవో వలపులు రువ్వెను

చెలి... నా చెంత నీకింత జాగేలనే

చెలి... నా చెంత నీకింత జాగేలనే


చరణం 2:


చరణ మంజీర నాదాలలోన.. 

కరగి పోనిమ్ము గంధర్వ బాలా

చరణ మంజీర నాదాలలోన.. 

కరగి పోనిమ్ము గంధర్వ బాలా


సడలి పోవని సంకెళ్ళు వేసీ.....

సడలి పోవని సంకెళ్ళు వేసి.. 

సరస రాగాల తేలింతులే.. ఏ ఏ...


కనులీవేళ చిలిపిగ నవ్వెను.. 

మనసేవేవో వలపులు రువ్వెను

ఇక అందాల ఉయ్యాల లూగింతులే...

ఇక అందాల ఉయ్యాల లూగింతులే... 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు