RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, డిసెంబర్ 2025, ఆదివారం

శ్రీ సూర్యనారాయణ మేలుకో | Sri Suryanarayana Meluko | Song Lyrics | Mangamma gari Manavadu (1984)

శ్రీ సూర్యనారాయణ మేలుకో


చిత్రం :  మంగమ్మగారి మనవడు (1984)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం:  భానుమతి, వాణీ జయరాం


పల్లవి:


శ్రీ సూర్యనారాయణ మేలుకో.. 

మేలుకో..

మా చిలకమ్మ బులపాటము.. 

చూసిపో.. చుసిపో..

శ్రీ సూర్యనారాయణ మేలుకో.. 

మేలుకో..

మా చిలకమ్మ బులపాటము.. 

చూసిపో.. చుసిపో..

తెల్లావారకముందే ఇల్లంతా 

పరుగుల్లు.. ఆ..

చీకట్లో ముగ్గుల్లు.. చెక్కిట్లో సిగ్గుల్లు

ఏమి వయ్యారమో... ఓ.. ఓ.. ఓ..

ఏంత విడ్డూరమో.. హు.. 

ఇంకెంత విడ్డూరమో

శ్రీ సూర్యనారాయణ మేలుకో.. 

మేలుకో..

మా అమ్మమ్మ ఆరాటము.. 

చూసిపో.. చూసిపో

చిట్టిమనవడి రాక 

చెవిలోన పడగానే..

ముసిముసి చీకట్లో.. 

ముసలమ్మ రాగాలు

ఏమి జాగారమో.. ఓ..

ఎంత సంబరమో.. ఎంత సంబరమో...


చరణం 1:


సరి అంచు పైట సవరించుకున్నా..

మరి మరి.. జారుతుంది

ఓసోసి మనవరాల.. ఏం జరిగింది..

ఓసోసి మనవరాల.. ఏం జరిగింది

తాతయ్యను నువ్వు తలచిన 

తొలినాడు...

నీకేమి జరిగిందో అమ్మమ్మ..

తాతయ్యను నువ్వు తలచిన 

తొలినాడు..

నీకేమి జరిగిందో.. అమ్మమ్మ...

నాకంతే జరిగింది... అమ్మమ్మ

అమ్మదొంగా... రంగ రంగ..

అమ్మదొంగా... రంగ రంగ..

శ్రీ సూర్యనారాయణ మేలుకో.. 

మేలుకో..

మా అమ్మమ్మ ఆరాటము.. 

చూసిపో.. చూసిపో


చరణం 2:


కోడిని కొడితే... సూర్యుణ్ణి లేపితే.. 

తెల్లరిపోతుందా

ఓ పిల్ల పెళ్ళిగడియ.. వస్తుందా

ఓ పిల్ల పెళ్ళిగడియ.. వస్తుందా...


దిగివచ్చి బావను క్షణమైన ఆపితే..

దేవున్ని నిలదీయనా

ఓయమ్మో.. కాలాన్ని తిప్పేయనా


నా పిచ్చితల్లి.. ఓ బుజ్జిమల్లి.. 

నీ మనసే బంగారం

నూరేళ్ళు నిలవాలి.. ఈ మురిపం

నూరేళ్ళు నిలవాలి.. ఈ మురిపం

అమ్మమ్మ మాట ముత్యాల మూట

ఆ విలువ నేనెరుగనా.. 

ఏనాడు అది నాకు తొలిదీవెన..


శ్రీ సూర్యనారాయణ మేలుకో.. 

మేలుకో..

మా చిలకమ్మ బులపాటము.. 

చూసిపో.. చుసిపో

శ్రీ సూర్యనారాయణ మేలుకో.. 

మేలుకో..

మా అమ్మమ్మ ఆరాటము.. 

చూసిపో.. చూసిపో


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు