తెల్లావారకముందే పల్లె లేచింది
చిత్రం : ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
గీతరచయిత : మల్లెమాల
నేపధ్య గానం : పి.సుశీల
పల్లవి:
తెల్లావారకముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
అదిరిపడి మేల్కొంది...
అదేపనిగ కూసింది
తెల్లావారకముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
చరణం 1:
వెలుగు దుస్తులేసుకొని సూరీడు
తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికి ఎంత భయమేసిందో
పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
అది చూసి... లతలన్నీ...
ఫక్కున నవ్వాయి
ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి
తెల్లావారకముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
చరణం 2:
పాలవెల్లిలాంటి మనుషులు
పండు వెన్నెల వంటి మనసులు
మల్లెపూల రాశివంటి మమతలు
పల్లెసీమలో కోకొల్లలు
అనురాగం... అభిమానం..
అనురాగం... అభిమానం..
కవలపిల్లలు
ఆ పిల్లలకు పల్లెటూళ్ళు
కన్నతల్లులు
తెల్లావారకముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి