వంగతోట కాడ ఒళ్ళు జాగర్త
చిత్రం : మంగమ్మగారి మనవడు (1984)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సి.నారాయణరెడ్డి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
నోమీ నోమన్నల్లాల నోమన్నలాల
సందామామ సందామామ
నోమీ నోమన్నల్లాల నోమన్నలాల
సందామామ సందామామ
పొద్దువాలకముందే పోదారిరాయే
తూరుపోళ్ళ బుల్లెమ్మ
పొద్దువాలకముందే పోదారిరాయే
తూరుపోళ్ళ బుల్లెమ్మ
బారెడంత పొద్దుంది నేరాను పోరా
బూటకాల బుల్లోడా...
బూటకాల బుల్లోడా
బారెడంత పొద్దుంది నేరాను పోరా
బూటకాల బుల్లోడా...
బూటకాల బుల్లోడా
నోమీ నోమన్నల్లాల
నోమన్నలాల సందామామ
సందామామ... సందామామ..
సందామామ..సందామామ
వంగతోట కాడ ఒళ్ళు జాగర్త
వంగతోట కాడ ఒళ్ళు జాగర్త
నంగనాచి ముళ్ళు
తొంగి తొంగుంటాయ్
నంగనాచి ముళ్ళు
తొంగి తొంగుంటాయ్
నాటుకుంటే తీయాలంటే
నా తరమా... నీ తరమా
కందతోట కాడ కాళ్ళు జాగర్త
కందతోట కాడ కాళ్ళు జాగర్త
చీలిఉన్న దుంప
కాలికంటుకుంటే
చీలిఉన్న దుంప
కాలికంటుకుంటే
ఆ దురద ఆపాలంటే
నీ తరమా... నా తరమా
కందతోట కాడ కాళ్ళు జాగర్త
చరణం 1 :
దోరమిరపకాయ లాగా
ధుమధుమలాడుతున్నావు
దోరమిరపకాయ లాగా
ధుమధుమలాడుతున్నావు
కారం తగ్గించుకో...
వెటకారం ఒగ్గేసుకో
కాడమల్లె పువ్వలాగా
గమగమలాడుతున్నావు
కాడమల్లె పువ్వలాగా
గమగమలాడుతున్నావు
మురిపెం ముడేసుకో...
నీ పరువం దాచేసుకో
చెరుకులాంటి కరుకుదనం
చాలు చాలు చాలు కొరికి చూస్తే
దాని రుచి మేలు మేలు మేలు
కందతోటకాడ కాళ్ళు జాగర్త
వంగతోటకాడ ఒళ్ళు జాగర్త
చరణం 2 :
ఏటి కాలవగట్టు మీద
ఎగిరెగిరి పడుతున్నావు
ఏటి కాలవగట్టు మీద
ఎగిరెగిరి పడుతున్నావు
చప్పున దాటేసుకో...
ననుగుట్టుగా వాటేసుకో హాయ్
రెల్లు పొదల లంకలోన
రేగిరేగి పోతున్నావు
రెల్లు పొదల లంకలోన
రేగిరేగి పోతున్నావు
కళ్ళెం వేసేసుకో
నీ అల్లరి ఆపేసుకో
పొగరున్న వంశంలే
నాది నాది నాది
ఆ వంశం నీదేనా
నాది నాది నాది
వంగతోటకాడ ఒళ్ళు జాగర్త
కందతోటకాడ కాళ్ళు జాగర్త
నంగనాచి ముళ్ళు
తొంగి తొంగుంటాయ్
నాటుకుంటే తీయాలంటే
నా తరమా... నీ తరమా
కందతోటకాడ కాళ్ళు జాగర్త
వంగతోటకాడ ఒళ్ళు జాగర్త...
హా.. హా.. హా
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి