RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, డిసెంబర్ 2025, ఆదివారం

చందురుడు నిన్ను చూసి | Chandurudu Ninnu Chusi | Song Lyrics | Mangamma gari Manavadu (1984)

చందురుడు నిన్ను చూసి


చిత్రం :  మంగమ్మగారి మనవడు (1984)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


చందురుడు నిన్ను చూసి 

చేతులెత్తాడు

చందురుడు నిన్ను చూసి  

చేతులెత్తాడు

తన అందం నీలో చూసి.. 

తడబడిపోయాడు.. 

తబ్బిబ్బైయ్యాడు

ఔనా .. ఏమో..

ఔనా .. ఏమో..

గోదారి నిన్ను చూసి  

గుసగుసలాడింది

గోదారి నిన్ను చూసి 

గుసగుసలాడింది

తన వేగం నీలో చూసి 

తడబడిపోయింది.. 

తబ్బిబ్బైయింది

ఔనా.. ఏమో..

ఔనా.. ఏమో..


చరణం 1:


ఎవరికి లొంగని మగసిరిలో.. 

ఎన్నడు తరగని సుగుణంలో

ఎవరికి లొంగని మగసిరిలో.. 

ఎన్నడు తరగని సుగుణంలో

రాముడివే నీవు.. 

ఆ రాముడివే నీవు...

ఏ రాముడు... అగ్గి రాముడా... 

బండ రాముడా..

అడవి రాముడా... 

శృంగార రాముడా...

ఉహు...ఉహు...

ఉ...ఉ...ఉ..ఉ...ఉ...ఉ..

అయోధ్యా రాముడివే... 

ఆ సీతా రాముడివే


గోదారి నిన్ను చూసి.. 

గుసగుసలాడింది

తనవేగం నీలో చూసి.. 

తడబడిపోయింది... 

తబ్బిబ్బైయింది


చరణం 2:


భామలు మెచ్చిన రసికతలో... 

ప్రేమలు పంచిన చతురతలో..

భామలు మెచ్చిన రసికతలో... 

ప్రేమలు పంచిన చతురతలో

కృష్ణుడివే నీవు... 

ఆ కృష్ణుడివే నీవు...


ఏ కృష్ణుడు... చిలిపి కృష్ణుడా... 

కొంటె కృష్ణుడా...

భలే కృష్ణుడా... గోపాల కృష్ణుడా?


ఉహు...ఉహు...

ఉ...ఉ...ఉ..ఉ...ఉ...ఉ..

బృందావన కృష్ణుడివే... 

ఆ రాధాకృష్ణుడివే...


చందురుడు నిన్ను చూసి... 

చేతులెత్తాడు

తన అందం నీలో చూసి... 

తడబడిపోయాడు.. 

తబ్బిబ్బైయ్యాడు


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు