RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, డిసెంబర్ 2025, గురువారం

ఒయ్యార మొలికే చిన్నదీ | Oyyaramolike Chinnadi | Song Lyrics | Mangamma Sapatham (1965)

ఒయ్యార మొలికే చిన్నదీ


చిత్రం : మంగమ్మ శపధం (1965)

సంగీతం :  టి.వి. రాజు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


ఓ.. ఓ.. ఓ..

ఒయ్యార మొలికే చిన్నదీ.. 

ఉడికించుచున్నదీ

రమ్మంటే రాను పొమ్మన్నది..

ఆ.. ఆ.. ఆ..

సయ్యాటలాడే ఓ దొరా.. 

సరసాలు మానరా

కవ్వింతలేల ఇక చాలురా... 


చరణం 1:


ఇంతలోనే ఏ వింత నీలో.. 

అంత తొందర కలిగించెను

చెంత నిలిచిన చిన్నారి చూపే.. 

అంతగా నన్ను కవ్వించెను

మనసే చలించెను.. 

అనురాగ వీణ పలికించెను

ఆ.. ఆ.. ఆ..


సయ్యాటలాడే ఓ దొరా.. 

సరసాలు మానరా

కవ్వింతలేల ఇక చాలురా...


చరణం 2:


ఒయలు చిలికే నీ కళ్ళలోని.. 

ఓర చూపులు ఏమన్నవి

నగవు లొలికే నా రాజులోని.. 

సొగసులన్ని నావన్నవి

తలపే ఫలించెను.. 

తొలి ప్రేమ నేడు చిగురించెను

ఓ.. ఓ.. ఓ..


ఒయ్యారమొలికే చిన్నదీ.. 

ఉడికించుచున్నదీ

రమ్మంటే రాను పొమ్మనది..


- పాటల ధనుస్సు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు