RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, నవంబర్ 2023, మంగళవారం

దంచవే మేనత్త కూతురా | Danchave Menatha kutura | Song Lyrics | Mangamma Gari Manavadu (1984)

దంచవే మేనత్త కూతురా



చిత్రం :  మంగమ్మగారి మనవడు (1984)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


దంచవే మేనత్త కూతురా... 

వడ్లు దంచవే నా గుండెలదరా

హ... హ.... హహ... హ... హ

దంచవే మేనత్త కూతురా... 

వడ్లు దంచవే నా గుండెలదరా

దంచు దంచు బాగా దంచు... 

అరె దంచు దంచు బాగా దంచు

దప్పి పుట్టినా.. కాస్త నొప్పి పెట్టినా... 

ఆగకుండ.. ఆపకుండ

అందకుండ... కందకుండ...

 దంచవే మేనత్త కూతురా... 

వడ్లు దంచవే నా గుండెలదరా


చరణం 1:


పోటు మీద పోటు వెయ్యి... 

పూత వయసు పొంగనియ్యి

ఎడమ చేత ఎత్తిపట్టు... 

కుడి చేత కుదిపి కొట్టు

పోటు మీద పోటు వెయ్యి... 

పూత వయసు పొంగనియ్యి

ఎడమ చేత ఎత్తిపట్టు... 

కుడి చేత కుదిపి కొట్టు... 


ఏ చెయ్యి ఎత్తితేమి... 

మరి ఏ చెయ్యి దించితేమి

హ... ఏ చెయ్యి ఎత్తితేమి... 

మరి ఏ చెయ్యి దించితేమి

అహహహహ...


కొట్టినా నువ్వే ... పెట్టినా నువ్వే

పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే

హా.. దంచుతా మంగమ్మ మనవడా

ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ

హా హా హాహాహాహా

దంచుతా మంగమ్మ మనవడా.. హోయ్

నేను దంచితే నీ గుండె దడ దడ


చరణం 2:


కోరమీసం దువ్వబోకు... 

కోక చుట్టూ తిరగమాకు

ఎగిరెగిరి పైన పడకు... 

ఇరుగు చూస్తే టముకు టముకు

కోరమీసం దువ్వబోకు... 

కోక చుట్టూ తిరగమాకు

ఎగిరెగిరి పైన పడకు... 

ఇరుగు చూస్తే టముకు టముకు 


ఏ కంట పడితేమి... 

ఎవ్వరేమంటే మనకేమి

ఏ కంట పడితేమి... 

ఎవ్వరేమంటే మనకేమి

నువ్వు పుట్టంగానే... 

బట్ట కట్టంగానే

నిన్ను కట్టుకునే హక్కున్న 

పట్టాదారుణ్ణి నేను


దంచవే మేనత్త కూతురోయ్

వడ్లు దంచవే నీ గుండెలదరదరదర

హా.. దంచుతా మంగమ్మ మనవడా

నేను దంచితే నీ గుండె దడ దడ

హా.. హా.. హా.. హా.. హాహాహాహా

హా.. హా.. హా.. హా.. హాహాహాహా


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు