అలిగితివా సఖీ ప్రియ
చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం : పెండ్యాల
గీతరచయితలు : పింగళి, నంది తిమ్మన
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా...
చరణం 1 :
లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా
లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా
ఈ పరీక్ష మాని ఇంక దయనుజూడవా ...ఆ..ఆ...
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
చరణం 2 :
నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని
నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని
సత్యాపతి నా బిరుదని నింద యెరుగవా...ఆ...ఆ..
అలిగితివా సఖీ ప్రియ కలత మానవా
చరణం 3 :
ప్రియురాలివి సరసనుండి
విరహమిటుల విధింతువా
ఆ...ఆ...ఆ..ఆ...ఆ...ఆ...ఆ...
ప్రియురాలివి సరసనుండి
విరహమిటుల విధింతువా
భరియింపగ నా తరమా కనికరింపవా..
ఆ...ఆ...ఆ..
నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తా
చిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా!
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి