మెరిసే మేఘ మాలికా
చిత్రం: దీక్ష (1974)
సంగీతం: పెండ్యాల ,
గీతరచయిత: సినారె,
నేపధ్య గానం: బాలు ,
పల్లవి:
మెరిసే మేఘ మాలికా..
ఉరుములు చాలు చాలిక
చెలితో మాట్లాడనీ..
వలపే పాట పాడనీ..
వలపే పాట పాడనీ
మెరిసే మేఘ మాలికా..
ఉరుములు చాలు చాలిక
చరణం 1:
కమలాలే నా రమణి నయనాలై విరిసే
అద్దాలే నా చెలియ చెక్కిళ్ళై మెరిసే
ఆ నయనాల కమలాలలోనా..
నా జిలుగు కలలు చూసుకోనీ
ఆ అద్దాల చెక్కిళ్ళోనా..
నా ముద్దులే దాచుకోనీ
మెరిసే మేఘ మాలికా..
ఉరుములు చాలు చాలిక
చరణం 2:
మధుమాసం చెలి మోవిని దరహాసం చేసే
చలి జాబిలి చెలి మోమున కళలారబోసే
ఆ దరహాస కిరణాలలోనా..
నను కలకాలం కరిగిపోనీ
ఆ కళల పండు వెన్నెలలోనా..
నా వలపులన్ని వెలిగిపోనీ....
మెరిసే మేఘ మాలికా..
ఉరుములు చాలు చాలిక
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి