పువ్వు దాగినా తావి దాగదు
చిత్రం : కోటలో పాగా (1976)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
పువ్వు దాగినా తావి దాగదు
నీవు దాగినా నీడ దాగదు
పువ్వు దాగినా తావి దాగదు
నీవు దాగినా నీడ దాగదు..
నీడ దాగదు
సెలయేటి కెరటాల పరుగు ఆగదు..ఊ..
సెలయేటి కెరటాల పరుగు ఆగదు..
వలచేటి హృదయాల ప్రేమ ఆగదు
ప్రేమ ఆగదు
పువ్వు దాగినా తావి దాగదు
నీవు దాగినా నీడ దాగదు..
నీడ దాగదు
చరణం 1:
కదిలేటి అధరాల కథలున్నవి...
మదిలోన మధురాల సుధలున్నవి
కదిలేటి అధరాల కథలున్నవి...
మదిలోన మధురాల సుధలున్నవి
కలలోన కవ్వించు రూపానివి
కలలోన కవ్వించు రూపానివి
కనుపాపలోనున్న దీపానివి...
పువ్వు దాగినా తావి దాగదు
నీవు దాగినా నీడ దాగదు..
నీడ దాగదు
చరణం 2:
నీ నీలికేశాల తెరచాపనై..
నీలాలగగనాల తేలించనా..
నీ నీలికేశాల తెరచాపనై..
నీలాలగగనాల తేలించనా..
మరుమల్లెగా మారి మురిపించనా...
మరుమల్లెగా మారి మురిపించనా
మరులూరపరువాలు కురిపించనా
పువ్వు దాగినా తావి దాగదు
నీవు దాగినా నీడ దాగదు..
సెలయేటి కెరటాల పరుగు ఆగదు
వలచేటి హృదయాల ప్రేమ ఆగదు..
ప్రేమ ఆగదు
పువ్వు దాగినా తావి దాగదు
నీవు దాగినా నీడ దాగదు..
నీడ దాగదు
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి