RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
yedukondala vada venkatesa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
yedukondala vada venkatesa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఏప్రిల్ 2026, గురువారం

ఏడూ కొండలవాడా వెంకటేశా | Edukondalavada Venkatesha | Tragedy Song Lyrics | Soggadu (1975)

ఏడూ కొండలవాడా వెంకటేశా


చిత్రం : సోగ్గాడు (1975)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఎస్ పి బాలు,


పల్లవి :


ఏడూ కొండలవాడా వెంకటేశా...

అయ్యా... 

ఎంత పనిచేశావు తిరుమలేశా

చెట్టు మీద కాయను 

సముద్రంలో ఉప్పును

కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా


ఏడూ కొండలవాడా వెంకటేశా...

అయ్యా... 

ఎంత పనిచేశావు తిరుమలేశా

చెట్టు మీద కాయను 

సముద్రంలో ఉప్పును

కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా


చరణం 1 :


నువ్వేసిన ముడిని 

మనిషి తెంచేశాడు

నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు


నువ్వేసిన ముడిని 

మనిషి తెంచేశాడు

నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు


అన్యాయం అన్యాయం అంటే

వెళ్ళి దేవుడితో చెప్పుకో 

పొమ్మన్నాడు

పో.. పొమ్మన్నాడు  


ఏడూ కొండలవాడా వెంకటేశా

అయ్యా... 

ఎంత పనిచేశావు తిరుమలేశా... 

శ్రీనివాసా


చరణం 2 :


చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు

చట్టం ఒప్పుకుని 

ఇద్దరం కలవలేదు


చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు

చట్టం ఒప్పుకుని 

ఇద్దరం కలవలేదు


మనిషి చేసింది చట్టము... 

మాకు జరిగింది ద్రోహము

నువ్వే నిలబెట్టాలి 

నీతీ న్యాయమూ...  

లేదా నువ్వే శూన్యము


ఏడూ కొండలవాడా వెంకటేశా...

అయ్యా... 

ఎంత పనిచేశావు తిరుమలేశా... 

శ్రీనివాసా


చరణం 3 :


మాటమీద నిలబడే మనిషినీ

మనసు మార్చుకోను 

చేతకాని వాడినీ


మాటమీద నిలబడే మనిషినీ

మనసు మార్చుకోను 

చేతకాని వాడినీ


చేపట్టి విడువలేను ఆడదానిని

నీ మీద ఒట్టు నేనొంటరివాడ్ని...  

ఒంటరివాడ్ని


ఏడూ కొండలవాడా వెంకటేశా...

అయ్యా... 

ఎంత పనిచేశావు తిరుమలేశా


చెట్టు మీద కాయను 

సముద్రంలో ఉప్పును

కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా

కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా


- పాటల ధనుస్సు 


3, అక్టోబర్ 2022, సోమవారం

ఏడుకొండలవాడ వెంకటేశా | Edukondalavada Venkatesa | Song Lyrics | Soggadu (1975)

ఏడుకొండలవాడ వెంకటేశా


చిత్రం : సోగ్గాడు (1975)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి :


ఏడుకొండలవాడ.. 

వెంకటేశా

ఓరయ్యో ఎంతపని చేశావు.. 

తిరుమలేశా

చెట్టు మీద కాయను.. 

సముద్రంలో ఉప్పును

కలిపినట్టే కలిపావు.. 

శ్రీనివాసా


ఏడుకొండలవాడ.. 

వెంకటేశా

ఓరయ్యో ఎంతపని చేశావు.. 

తిరుమలేశా

చెట్టు మీద కాయను.. 

సముద్రంలో ఉప్పును

కలిపినట్టే కలిపావు.. 

శ్రీనివాసా


ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

ఏడు కొండలవాడ.. 

వెంకటేశా

ఓరయ్యో ఎంతపని చేశావు.. 

తిరుమలేశా

చెట్టు మీద కాయను.. 

సముద్రంలో ఉప్పును

కలిపినట్టే కలిపావు.. 

శ్రీనివాసా


చరణం 1 :


చిలకమ్మ తట్టితే తలుపు తీశా.. 

మళ్ళీ చెయి జారి పోకుండా కట్టేసా..

చిలకమ్మ తట్టితే తలుపు తీశా.. 

మళ్ళీ చెయి జారి పోకుండా కట్టేసా..


ఆ..ఆ...ఆ.. 

గోరొంక గూటిలోకి వచ్చేశా.. 

దాచి ఉన్నదంత మనసిప్పి ఇచ్చేసా

గోరొంక గూటిలోకి వచ్చేశా.. 

దాచి ఉన్నదంత మనసిప్పి ఇచ్చేసా


సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేశా... 

సోగ్గత్తెనిక వదలనని మొండికేశా

సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేశా... 

సోగ్గత్తెనిక వదలనని మొండికేశా


వెంకటేశా..ఆ...ఆ...ఆ...తిరుమలేశా

తిరుమలేశా..ఆ...ఆ...ఆ..శ్రీనివాసా

ఏడు కొండలవాడ.. వెంకటేశా

ఓరయ్యో ఎంతపని చేశావు.. 

తిరుమలేశా


చెట్టు మీద కాయను.. 

సముద్రంలో ఉప్పును

కలిపినట్టే కలిపావు.. 

శ్రీనివాసా


చరణం 2 :


సిగ్గుతెర నేటితో ఒగ్గేసా... 

పూల చెండల్లే.. నీ చేతికొచ్చేసా

సిగ్గుతెర నేటితో ఒగ్గేసా... 

పూల చెండల్లే.. నీ చేతికొచ్చేసా


ఆ...ఆ...ఆ..

వళ్ళంతా ముద్దులతో ముద్దరేసా.. 

నువ్వోపకుంటే పెనవేసి ఒకటి చేశా

వళ్ళంతా ముద్దులతో  ముద్దరేసా.. 

నువ్వోపకుంటే పెనవేసి ఒకటి చేశా


కన్నెతనం పక్కమీద  పరిచేసా... 

దాన్ని కడదాక కాస్తానని.. ఒట్టేసా

కన్నెతనం పక్కమీద  పరిచేసా... 

దాన్ని కడదాక కాస్తానని.. ఒట్టేసా


వెంకటేశా..ఆ..ఆ..ఆ.. తిరుమలేశా

తిరుమలేశా..ఆ...ఆ...ఆ..శ్రీనివాసా


ఏడుకొండలవాడ.. 

వెంకటేశా

ఓరయ్యో.. ఎంతపని చేసావు.. 

తిరుమలేశా

చెట్టు మీద కాయను.. 

సముద్రంలో ఉప్పును

కలిపినట్టే కలిపావు.. 

శ్రీనివాసా


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు