RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ye ooru ye vaada లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ye ooru ye vaada లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఏప్రిల్ 2022, శనివారం

ఏ ఊరు ఏ వాడ అందగాడా | Ye Ooru Ye Vada | Song Lyrics | Hema Hemeelu (1979)

ఏ ఊరు ఏ వాడ అందగాడా



చిత్రం  :  హేమా హేమీలు (1979)

సంగీతం  :  రమేశ్ నాయుడు

గీతరచయిత  :  వేటూరి

నేపధ్య గానం  :  బాలు, సుశీల   


పల్లవి :


ఏ ఊరు?... నీదే ఊరు?

ఏ ఊరు..ఏ వాడ అందగాడా

మా ఊరు వచ్చావు సందకాడ


ఆకాశంలో ఉన్న చందమామని

నీ కోసం దిగివచ్చిన మేనమామని

ఆకాశంలో ఉన్న చందమామనీ

నీ కోసం దిగివచ్చిన మేనమామనీ

వరస కలుపుకొందామా.. 

సరసమాడుకొందామా

ఏ ఊరు..నీదే ఊరు

ఏ ఊరు..ఏ వాడ అందగాడా

మా ఊరు వచ్చావు సందకాడ


లు లు లూ..లు లు లూ..

హా..హే..లు లు లూ..

హా..హా..లు లు లు.. 


చరణం 1 :


నీలిమబ్బు కోక చుడతా.. 

తోక చుక్క రైక పెడతా

నీలిమబ్బు కోక చుడతా.. 

తోక చుక్క రైక పెడతా

నాపేన చంద్రహారం నీకు చేయిస్తా

ఏమిస్తావూ? ఊ..ఊహూఊ..

నన్నేం చేస్తావు?



మీ ఊళ్ళో చుక్కలు దులిపి... 

మా ఊళ్ళో గుక్కలు తడిపి

మీ ఊల్లో చుక్కలు దులిపి... 

మా ఊల్లో గుక్కలు తడిపి

ప్రేమిస్తే.. పెగ్గుకటి ఇస్తా..  

ముద్దొస్తే.... ముద్దర వేస్తా..


పడుచందం పందిరివేస్తా..

పందిట్లో విందులు చేస్తా..

పడుచందం పందిరివేస్తా..

పందిట్లో విందులు చేస్తా..


ఏ..ఊరు..నీదే ఊరు..

ఏ ఊరు..ఏ వాడ..అందగాడా

మా ఊరు వచ్చావు సందెకాడ


లు లు లూ.. లులుల్లూ లు లు లూ

లు లు లూ..లులుల్లూ లు లు లూ

హా..హే..ఆ..హే..లు లు లూ... 



చరణం 2 :


మల్లెలతో అల్లరి పెడతా... 

వెన్నెలతో ఆవిరి పడతా

మల్లెలతో అల్లరి పెడతా... 

వెన్నెలతో ఆవిరి పడతా

అందాల ఆగ్రహారం నీకు రాసిస్తా..

ఏం చేస్తావో? ఉహు..హూ..హూ.... 

నన్నేం చేస్తావో?


నింగిలాగ నేలకి వంగి..

నీరులాగ మబ్బున దాగి

నింగిలాగ నేలకి వంగి..

నీరులాగ మబ్బున దాగి

గెలిపిస్తే... ఉరుమై వస్తా..

జడిపిస్తే... పిడుగైపోతా

వరదొస్తే వంతెన వేస్తా.. 

సరదాగా సంకెల వేస్తా

వరదొస్తే వంతెన వేస్తా.. 

సరదాగా సంకెల వేస్తా


ఏ..ఊరు..నీదే ఊరు

ఏ ఊరు..ఏ వాడ..అందగాడా

మా ఊరు వచ్చావు సందెకాడ


- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు