RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
yama gola songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
yama gola songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఫిబ్రవరి 2022, సోమవారం

వయసు ముసురుకొస్తున్నది | Vayasu Musuru kostunnadi | Song Lyrics | Yama Gola (1977)

వయసు ముసురుకొస్తున్నది



చిత్రం :   యమగోల (1977)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :   బాలు,  సుశీల


పల్లవి :


ఏహే..హే..హే..హే..ఆహా హా హా ఆహా అహా హా


వయసు ముసురుకొస్తున్నదీ.. వాన మబ్బులా

సొగసు దూసుకొస్తున్నది.. సూది మెరుపులా

వయసు ముసురుకొస్తున్నదీ.. వాన మబ్బులా

సొగసు దూసుకొస్తున్నది.. సూది మెరుపులా


అయ్య బాబో..య్ ఆగలేనూ..

ఆ ముసురూ.. ఈ విసురూ..ఊ..ఊ..ఊ ఆపలేను..ఊ..ఊ


చరణం 1 :


కన్నుల తెర తీసి.. వెన్నెల వల వేసీ

కన్నుల తెర తీసి.. వెన్నెల వల వేసీ

ప్రాణం లాగేసి .. పోతే ఎలా...


యేటి కాడ కన్నుకొట్టి.. తోట కాడ చేయిపట్టి

యేటి కాడ కన్నుకొట్టి.. తోట కాడ చేయిపట్టి

నా పైట ఈ పూట నాజూకుగా లాగి పట్టి

మెలికేస్తే..ఎలా..ఎలా..పెనవేస్తే ఎలా ఎలా

అయ్య బాబోయ్ ఆగ లేనూ

ఆ ముసురూ..ఈ విసురూ..ఊ..ఊ..ఆపలేనూ..


చరణం 2 :


చెంపలు నిమిరేసీ....సిగ్గులు కాజేసీ..

చెంపలు నిమిరేసీ....సిగ్గులు కాజేసీ..

నిప్పులు చెరిగేసి పోతే ఎలా.....


నిన్న కలలో వెన్ను తట్టి.. మొన్న కలలో ముద్దు పెట్టి..

నిన్న కలలో వెన్ను తట్టి.. మొన్న కలలో ముద్దు పెట్టి..

ఆపైనా నాలోన తీపి సెగలే రగులబెట్టి

ఊరుకుంటే ఎలా..ఎలా..జారుకుంటే ఎలా..ఎలా..

అయ్యబాబోయ్ ఆగలేనూ..

ఆ ముసురూ...ఈ విసురూ.. ఆప లేనూ..


- పాటల ధనుస్సు 

ఆడవే అందాల సురభామిని | Aadave Andala Surabhamini | Song Lyrics| Yama Gola (1977)

ఆడవే అందాల సురభామిని



చిత్రం :  యమగోల (1977)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వీటూరి

నేపధ్య గానం :  బాలు,  సుశీల


పల్లవి :


ఆడవే అందాల సురభామిని

ఆడవే అందాల సురభామిని .. 

పాడవే కళలన్నీ ఒకటేననీ..

ఆడవే అందాల సురభామిని

గానమేదైనా స్వరములొక్కటే..

పనిపస నిసనిగ నిపమగ మపగస మగసని సగని

నాట్యమేదైనా నడక ఒక్కటే .. 

భాష ఏదైనా భావమొక్కటే ..

అన్ని కళల పరమార్థమొక్కటే .. 

అందరినీ రంజింపజేయుటే..

ఆ.ఆ.. ఆడవే అందాల సురభామిని...


చరణం 1:


ఓహో రంభా... సకల కళానికురంభా

రాళ్ళనైనా మురిపించే జాణవట.. 

అందానికి రాణివట

ఏదీ.. నీ హావభావ విన్యాసం

ఏదీ.. నీ నాట్యకళాచాతుర్యం


ఆఆఆ... ఆఆఆ ... ఆఆఆఆఆఆ


అరువది నాలుగు కళలందు మేటిని .. 

అమరనాథునికి ప్రియ వధూతిని

అరువది నాలుగు కళలందు మేటిని .. 

అమరనాథునికి ప్రియ వధూతిని

సరసాలలో.. ఈ సురశాలలో .. ..

సరసాలలో.. ఈ సురశాలలో..

సాటిలేని శృంగార వాసిని ..

నిత్యనూతన రాగ స్రవంతిని.. 

రసవంతిని జయ జయవంతిని ..

రసవంతిని.. జయ జయవంతిని


చరణం 2 :

ఆడవే అందాల సురభామిని .. 

పాడవే కళలన్నీ ఒకటేననీ..

ఆడవే అందాల సురభామిని

ఓహో ఊర్వశీ.. అపురూప సౌందర్య రాశి

ఏదీ..  నీ నయన మనోహర నవరస లాస్యం

ఏదీ..  నీ త్రిభువన మోహన రూప విలాసం


మదనుని పిలుపే నా నాదము .. 

స్మర కదన శాస్త్రమే నా వేదము

మదనుని పిలుపే నా నాదము .. 

స్మర కదన శాస్త్రమే నా వేదము

కనువిందుగా .. కరగని పొందుగా .. 

కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము

అంతులేని శృంగార పిపాసిని .. 

తరతరాల మీ ప్రేయసిని... చారుకేశిని..


చరణం 3 :

ఆడవే అందాల సురభామిని .. 

పాడవే కళలన్నీ ఒకటేననీ..

ఆడవే అందాల సురభామిని...

 

ఓహో మేనకా!.. మదన మయూఖా

సాగించు నీ రాసలీలా.. 

చూపించు శృంగార హేలా .. 

సాగించు నీ రాసలీలా


నగవులతో మేని బిగువులతో...

నగవులతో మేని బిగువులతో.. 

వగలొలికించు వయ్యారి నెరజాణను

ఏ చోట తాకినా... ఏ గోట మీటినా .. 

మధువులొలికించు మరులు చిలికించు

మధురమైన రసవీణను .. 

రతిరాజ కళా ప్రవీణను... 

సారంగలోచనను..


 ఆడవే అందాల సురభామిని .. 

పాడవే కళలన్నీ ఒకటేననీ .. 

ఆడవే అందాల సురభామిని

- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు