RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
gundelona oka matundi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
gundelona oka matundi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, అక్టోబర్ 2022, మంగళవారం

గుండెలోన ఒక మాటుంది | Gundelona oka matundi | Song Lyrics | Raja (1976)

గుండెలోన ఒక మాటుంది



చిత్రం :  రాజా (1976)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు,  సుశీల



పల్లవి :


గుండెలోన ఒక మాటుంది .. 

గొంతు దాటి రానంటుంది

గుండెలోన ఒక మాటుంది .. 

గొంతు దాటి రానంటుంది

ఉండలేకా .. వెలికి రాకా .. 

ఉబ్బితబ్బిబ్బవుతోంది


గుండెలోన ఒక మాటుంది .. 

గొంతు దాటి రానంటుంది

గుండెలోన ఒక మాటుంది .. 

గొంతు దాటి రానంటుంది

ఉండలేకా .. వెలికి రాకా .. 

ఉబ్బితబ్బిబ్బవుతోంది



చరణం 1:


నిదురలో ఒక కల వచ్చింది .. 

తెల్లవారే నిజమయ్యింది

నిదురలో ఒక కల ఒచ్చింది 

అది తెల్లవారే నిజమయ్యింది

ఆ .. ఆ .. ఆ..ఆ.. ఆ .. ఆ ..

నిజం నీతో చెప్పవస్తే 

నిండు మనసు మూగబోయింది


మూగబోయిన మనసులోనా 

రాగమేదో ఉంటుంది

ఆ నిజం మనకు తెలిసేలోగా 

నిదుర మళ్ళీ వస్తుంది


గుండెలోన ఒక మాటుంది .. 

గొంతు దాటి రానంటుంది

ఉండలేకా .. వెలికి రాకా .. 

ఉబ్బితబ్బిబ్బవుతోంది 


చరణం 2:


ఆడ పిల్లకు పూలు బొట్టూ .. 

ఆది నుంచీ అందాలు

మనసు ఇచ్చే .. మనిషి వస్తే .. 

మారుతాయి అర్ధాలు


మనసు ఇచ్చిన మనిషితోటి 

మనుగడే ఆనందం

నొసట రాత రాసేవాడికే 

తెలుసు దాని అర్ధం


గుండెలోన ఒక మాటుంది .. 

గొంతు దాటి రానంటుంది

గుండెలోన ఒక మాటుంది .. 

గొంతు దాటి రానంటుంది

ఉండలేకా .. వెలికి రాకా .. 

ఉబ్బితబ్బిబ్బవుతోంది


గుండెలోన ఒక మాటుంది .. 

గొంతు దాటి రానంటుంది

ఉండలేకా .. వెలికి రాకా .. 

ఉబ్బితబ్బిబ్బవుతోంది


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు