RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
endukano ninu chudagane లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
endukano ninu chudagane లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, సెప్టెంబర్ 2025, శనివారం

ఎందుకనో నిను చూడగనే | Endukano Ninu Chudagane | Song Lyrics | CID (1965)

ఎందుకనో నిను చూడగనే



చిత్రం :  సి.ఐ.డి (1965)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  పింగళి నాగేంద్రరావు  

నేపధ్య గానం :  ఘంటసాల, పి.సుశీల


పల్లవి : 


ఎందుకనో నిను చూడగనే.. 

కవ్వించాలని ఉంటుంది

ఎందుకనో నిను చూడగనే.. 

కవ్వించాలని ఉంటుంది

కవ్వించి నీవు కలహమాడితే 

నవ్వుకొనాలని ఉంటుందీ..

ఎందుకనో...ఓ..ఓ..


ఎందుకనో నిను చూడగనే.. 

ఏదో ఇదిగా ఉంటుంది..

ఎందుకనో నిను చూడగనే.. 

ఏదో ఇదిగా ఉంటుంది..

నీ పెదవులపై నవ్వు చిందితే.. 

మనసు చల్లగా ఉంటుందీ..

ఎందుకనో..ఓ...ఓ..ఎందుకనో 


చరణం 1 : 


అడుగడుగున నీ రాజసమంతా.. 

ఒలికిస్తూ నువు కులుకుతు ఉంటే..

అడుగడుగున నీ రాజసమంతా.. 

ఒలికిస్తూ నువు కులుకుతు ఉంటే..


కొంగున కట్టుకు నిను తిప్పాలని..

నా కొంగున కట్టుకు నిను తిప్పాలని..

ఏదో వేడుక పుడుతుంది.... 

ఎందుకనో..


ఎందుకనో నిను చూడగనే.. 

ఏదో ఇదిగా ఉంటుంది..

కవ్వించి నీవు కలహమాడితే..  

నవ్వుకొనాలని ఉంటుందీ..

ఎందుకనో...ఓ..ఓ.. 


చరణం 2 :


అణువణువున నీ సొంపులు ఒంపులు.. 

నను మైకంలో ముంచుతు ఉంటే..

అణువణువున నీ సొంపులు ఒంపులు.. 

నను మైకంలో ముంచుతు ఉంటే..


నీలో ఐక్యం చెందాలంటూ...

నీలో ఐక్యం చెందాలంటూ... 

ఏదో తహతహ పుడుతుందీ.. 

ఎందుకనో..


ఎందుకనో నిను చూడగనే.. 

కవ్వించాలని ఉంటుంది

కవ్వించి నీవు కలహమాడితే.. 

నవ్వుకొనాలని ఉంటుందీ..

ఎందుకనో...ఓ..ఓ.. ఎందుకనో...

ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఓ..

అహా..హా..ఆ..హా.. ఓ..ఓహో..

ఓహో..ఓ...


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు