RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ela ela dachavu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ela ela dachavu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, సెప్టెంబర్ 2023, ఆదివారం

ఎలా ఎలా దాచావు | Ela Ela Dachavu | Song Lyrics | Gorintaku (1979)

ఎలా ఎలా దాచావు 



చిత్రం: గోరింటాకు (1979)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: దేవులపల్లి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


ఎలా ఎలా దాచావు

అలవి కాని అనురాగం...

ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ


ఎలా ఎలా దాచావు

అలవి కాని అనురాగం...

ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ..

ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ....


చరణం 1:


పిలిచి పిలిచినా..పలుకరించినా ..

పులకించదు కదా నీ ఎదా

ఉసురొసుమనినా...

గుసగుసమనినా ఊగదేమది నీ మది...


నిదుర రాని నిశిరాతురులెన్నో...

నిట్టూరుపులెన్నో...

నోరులేని ఆవేదనలెన్నో...

ఆరాటములెన్నో...


ఎలా ఎలా దాచావు

అలవి కాని అనురాగం...

ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ..

ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ....


చరణం 2:


తలుపులు తెరుచుకొని వాకిటనే 

నిలబడతారా ఎవరైనా?

తెరిచి ఉందనీ వాకిటి తలుపు... 

చొరబడతారా ఎవరైనా?


దొరవో... మరి దొంగవో

దొరవో... మరి దొంగవో

దొరికావు ఈనాటికీ....


దొంగను కానూ...దొరనూ కానూ..

దొంగను కానూ...దొరనూ కానూ...

నంగనాచినసలే కానూ....


ఎలా ఎలా దాచావు

అలవి కాని అనురాగం...

ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ


పాటల ధనుస్సు  




పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు