RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ee madhumasamlo ee darahasamlo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ee madhumasamlo ee darahasamlo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జనవరి 2025, ఆదివారం

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో | Ee Madhumasamlo | Song Lyrics | Kondaveeti Simham (1981)

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో



చిత్రం: కొండవీటి సింహం (1981)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


ఈ మధుమాసంలో ఈ దరహాసంలో

మదిలో కదిలి పలికే కోయిలా... 

బ్రతుకే హాయిగా

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో

మదిలో కదిలి పలికే కోయిలా... 

బ్రతుకే హాయిగా


చరణం 1:


ఆకాశం అంచులు దాటే 

ఆవేశం నా గీతం...

అందులోని ప్రతి అక్షరము 

అందమైన నక్షత్రం

ఆ గీతం పలికిన 

నా జీవితమే సంగీతం...

సంగమించు ప్రణయంలో 

ఉదయరాగ సింధూరం

ప్రేమే పెన్నిధిగా .. దైవం సన్నిధిగా

ప్రేమే పెన్నిధిగా .. దైవం సన్నిధిగా

సమశృతిలో జత కలిసి

ప్రియలయలో అదమరచి .. 

అనురాగాలు పలికించువేళా...


ఈ మధుమాసంలో ఈ దరహాసంలో

మదిలో కదిలి పలికే కోయిల 

బ్రతుకే హాయిగా


చరణం 2:


అందమైన మన ఇల్లు 

అవని మీద హరివిల్లు

ఋతువులెన్ని మారినా 

వసంతాలు వెదజల్లు...

తెలవారిన సంధ్యలలో 

తేనె నీటి వడగళ్ళు

జ్ఞాపకాల నీడలలో 

కరుగుతున్న కన్నీళ్ళు

ఒకటే ఊపిరిగా.. కలలే చూపులుగా

ఒకటే ఊపిరిగా .. కలలే చూపులుగా

మనసులలో మనసెరిగి

మమతలనే మధువొలికే .. 

శుభయోగాలు తిలకించువేళా..


ఈ మధుమాసంలో ఈ దరహాసంలో

మదిలో కదిలి పలికే కోయిల 

బ్రతుకే హాయిగా


- పాటల ధనుస్సు


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు