RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

29, మార్చి 2026, ఆదివారం

చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ | Chitti Ammalu Chinni Nannalu | Song Lyrics | Astiparulu (1966)

చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ


చిత్రం: ఆస్థిపరులు (1966) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం: ఘంటసాల 


పల్లవి: 


చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ... 

మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు 


చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ... 

మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు... 


చిట్టి అమ్మలూ.... 


చరణం 1: 


ఎవరికెవరు వేశారు బంధము 

ఒకొరికొకరమైనాము ప్రాణము 

ఎవరికెవరు వేశారు బంధము 

ఒకొరికొకరమైనాము ప్రాణము 


నీకు నేను అమ్మనూ నాన్ననూ... 

నీకు నేను అమ్మనూ నాన్ననూ .. 

నాకు నీవే లోకాన సర్వమూ... 

నాకు నీవే లోకాన సర్వమూ ... 


చరణం 2: 


హృదయాలను మూయవీ తలుపులు 

విడదీశారమ్మా మన తనువులు 

ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు 

ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు .. 

తుడిచివేయవమ్మా నీ కన్నీళ్ళు 


చరణం 3: 


అన్న ఒడి వెచ్చదనం కోసం 

కన్ను మూయకున్నావు పాపం 

ఎదను చీల్చి పాడుతున్న జోలలు 

ఎదను చీల్చి పాడుతున్న జోలలు .. 

నిదురపుచ్చులే నిన్ను అమ్మలు 

నిదురపుచ్చులే నిన్ను అమ్మలు ...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ | Chitti Ammalu Chinni Nannalu | Song Lyrics | Astiparulu (1966)

చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ చిత్రం: ఆస్థిపరులు (1966)  సంగీతం: కె.వి. మహదేవన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: ఘంటసాల  పల్లవి:  చిట్ట...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు