RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, మార్చి 2026, మంగళవారం

మబ్బులో ఏముంది | Mabbulo Emundi | Song Lyrics | Lakshadhikari (1963)

మబ్బులో ఏముంది


చిత్రం : లక్షాధికారి (1963)

సంగీతం : టి.చలపతిరావు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, పి.సుశీల  


పల్లవి :


మబ్బులో ఏముంది...

నా మనసులో ఏముంది.. 

నా మనసులో ఏముంది?

మబ్బులో కన్నీరు..


నీ మనసులో పన్నిరు.. 

నీ మనసులో పన్నీరు..

అవునా..ఉహు..ఊ..ఊ.... 


చరణం 1:


తోటలో ఏముంది.. 

నా మాట లో ఏముంది? 

నా మాటలో ఏముంది?


తోటలో మల్లియలు.. 

నీ మాటలో తేనియలు.. 

నీ మాటలో తేనియలు ..

ఉహు..ఊ..ఊ..ఊ..

ఊహు..ఊ..ఊ..ఊ.. 


చరణం 2 :


చేనులో ఏముంది?.. 

నా మేనులో ఏముంది?.. 

నా మేనులో ఏముంది?


చేనులో బంగారం.. 

నీ మేనులో సింగారం... 

నీ మేనులో సింగారం


చరణం 3:


ఏటిలో ఏముంది?.. 

నా పాటలో ఏముంది?... 

నా పాటలో ఏముంది?

ఏటిలో గలగలలు.. 

నీ పాటలో సరిగమలు... 

నీ పాటలో సరిగమలు


నేనులో ఏముందీ?.. 

నీవులో ఏముంది?... 

నీవులో ఏముంది?

నేనులో నీవుంది... 

నీవులో నేనుంది... 

నీవులో నేనుంది


నేనులో నీవుంది 

నీవులో నేనుంది

నీవులో నేనుంది 

నేనులో నీవుంది...

అహ..ఆ..అహ..ఆ..

అహ..ఆ..అహ..ఆ..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వేచ్ఛ కోసం ఉద్యమించిన | స్వాతంత్ర్యదినోత్సవ పాట | Swechakosam | Song Lyrics | RK Duvvu | RKSS Creations

స్వాతంత్ర్యదినోత్సవ పాట  స్వేచ్ఛ కోసం ఉద్యమించిన రచన : రామకృష్ణ దువ్వు  Production : RKSS Creations... సాకి:   స్వేచ్ఛ కోసం ఉద్యమించిన...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు