RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

26, మార్చి 2026, గురువారం

ఎలగో ఎలాగో ఎలాగో ఉన్నది | Elago Elago Elago Vunnadi | Song Lyrics | Lakshadhikari (1963)

ఎలగో ఎలాగో ఎలాగో ఉన్నది


చిత్రం : లక్షాధికారి (1963)

సంగీతం : టి.చలపతిరావు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : పి.సుశీల 


పల్లవి :


ఆ.. ఆ.. ఆ..

ఓ...ఓ.. ఓ..

ఎలగో ఎలాగో ఎలాగో ఉన్నది

ఇలాగే ఉంటుందా 

తోలి ప్రేమ అన్నది

అలా అలా అలా మనసు 

తేలిపోవుచున్నది

ఎలగో ఎలాగో ఎలాగో ఉన్నది


చరణం 1 : 


చిన్నవాడు ఓర చూపు 

చూసి నవ్వెను

వెన్నెలాగ లేత మనసు 

కరిగిపోయెను

చిన్నవాడు ఓర చూపు 

చూసి నవ్వెను

వెన్నెలాగ లేత మనసు 

కరిగిపోయెను


చేయి చేయి కలపగానే 

మెరుపు మెరిసెను

ఆ మెరుపులోన నా మేను 

జలదరించెను


ఇలాగే ఉంటుందా 

తోలి ప్రేమ అన్నది

అలా అలా అలా మనసు 

తేలిపోవుచున్నది

ఎలగో ఎలాగో ఎలాగో ఉన్నది


చరణం 2 :


కనులలోన గులాబీలు 

పూయుచున్నవి..

మునుపులేని అనుభవాలు 

ముసురుకున్నవి

కనులలోన గులాబీలు 

పూయుచున్నవి..

మునుపులేని అనుభవాలు 

ముసురుకున్నవి


మధురమైన మైకమేదో 

కలుగుచున్నది

ఆ మైక మందు 

నేనేదో మారిపోతిని


ఇలాగే ఉంటుందా 

తోలి ప్రేమ అన్నది

అలా అలా అలా మనసు 

తేలిపోవుచున్నది

ఎలగో ఎలాగో ఎలాగో ఉన్నది


చరణం 3 :


చల్ల గాలి అతను ఊసు 

తెలుపుతున్నది

మల్లెతీగలాగ ఆశ 

అల్లుకున్నది

చల్ల గాలి అతను ఊసు 

తెలుపుతున్నది

మల్లెతీగలాగ ఆశ 

అల్లుకున్నది 


కన్నెవలపు అతని చుట్టు 

తిరుగుతున్నది

ఆ వన్నెకాణ్ణి విడిచి 

తాను రానన్నది  


ఇలాగే ఉంటుందా 

తోలి ప్రేమ అన్నది

అలా అలా అలా మనసు 

తేలిపోవుచున్నది

ఎలగో ఎలాగో ఎలాగో ఉన్నది


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నవ్వింది మల్లె చెండు | Navvindi Malle Chendu | Song Lyrics | Abhilasha (1983)

నవ్వింది మల్లె చెండు చిత్రం : అభిలాష (1983)  సంగీతం : ఇళయరాజా  గీతరచయిత : వేటూరి  నేపథ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి   పల్లవి  : యురేకా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు