RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, జనవరి 2025, సోమవారం

బూజం బంతి పువ్వో పువ్వో | Bujam Banti Bujam Banti | Song Lyrics | Ooruki Monagadu (1981)

బూజం బంతి పువ్వో పువ్వో



చిత్రం : ఊరికి మొనగాడు (1981)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో

బుజబుజరేకుల పిల్లా నవ్వు బంతీ పువ్వో

బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో

బుజబుజరేకుల పిల్లా నవ్వు బంతీ పువ్వో


కాదన్నట్టే ఉంటాదమ్మో  కన్నే పువ్వో...

నాదన్నట్టే ఉంటాదమ్మో  నవ్వో నవ్వో


బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో

బుజబుజరేకుల పిల్లాడంటే బంతీ పువ్వో

బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో

బుజబుజరేకుల పిల్లాడంటే బంతీ పువ్వో


ఔనన్నట్టే ఉంటాదమ్మో వాడి నవ్వో

నాదన్నట్టే ఉంటాదమ్మో నవ్వో పువ్వో


హోయ్... 

బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో

బుజబుజరేకుల పిల్లాడంటే బంతీ పువ్వో


చరణం 1 :


బుగ్గ మెరుపే మొగ్గ పడితే సందెలైపోయే

కురులు దువ్వి కొప్పు పెడితే రాతిరైపోయే

పూలు ముడిచి నవ్వగానే పున్నమైపోయే

పూలు ముడిచి నవ్వగానే పున్నమైపోయే


చిలిపివాడి వలపుబాట 

లిపికి దొరకని తీపి పాట

ఊరూ పాడే.. ఏరు పాడే

ఊరూ పాడే.. ఏరు పాడే.. ఒకటే పాట

పైరు పచ్చ ఈడుజోడు పాడే పాటా


అరెరే... 

బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో

బుజబుజరేకుల పిల్లా నవ్వు బంతీ పువ్వో


ఔనన్నట్టే ఉంటాదమ్మో వాడి నవ్వో

నాదన్నట్టే ఉంటాదమ్మో నవ్వో పువ్వో


హోయ్... 

బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో

బుజబుజరేకుల పిల్లాడంటే బంతీ పువ్వో


చరణం 2 :


హేయ్.. 

ఏటవాలు చూపు ఏదో మాటలాడింది

హోయ్.. 

ఎదల చాటు ఎదను దాటి మనసు లాగింది

చేరవస్తే జారు పైట పేరు నిలిపింది

చేరవస్తే జారు పైట పేరు నిలిపింది


పులకరించే వయసులోనా 

పలకరించే పడుచుగుండే

వాగువంకా.. హహహ

సాగే పాట.. హహహా

వాగువంకా సాగే పాట వలపే పాటా

పిల్లా పాప కలిగే దాకా పిలుపే పాటా


హోయ్... 

బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో

బుజబుజరేకుల పిల్లాడంటే బంతీ పువ్వో

కాదన్నట్టే ఉంటాదమ్మో  కన్నే పువ్వో...

నాదన్నట్టే ఉంటాదమ్మో  నవ్వో నవ్వో


హోయ్...  

బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో

బుజబుజరేకుల పిల్లా నవ్వు బంతీ పువ్వో 


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు