RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, జనవరి 2025, శనివారం

భవ్య కృష్ణ సీమంతం పాట | Bhavyakrishna Seemantham Song Lyrics | RKSS Creations

భవ్య కృష్ణ సీమంతం పాట



రచన : రామకృష్ణ దువ్వు  

 

పల్లవి:

 

శ్రీరస్తు శుభమస్తు మన భవ్యకృష్ణకు

మా దీవెనలతో నెలలు నిండిపోవాలి

ఆనందం మన గుండెల్లో పొంగిపోవాలి

బాలకృష్ణుని రాకకై ఎదురుచూపులా

దివినుండి శ్రీదేవి చేరు నీ ఒడి పాపాయిగా

 

 చరణం 1:

 

నవ్యంగా సాగేది ఈ మధుర క్షణం

శివ ప్రేమాశీర్వాదం నిత్య నందివర్ధనం

వంశీ మామ పలికే ప్రీతి స్వాగతం

వంశ పెద్దలు ఏకమై కోరిన చిన్ని వరం

 

శ్రీరస్తు శుభమస్తు మన భవ్యకృష్ణకు

మా దీవెనలతో నెలలు నిండిపోవాలి

ఆనందం మన గుండెల్లో పొంగిపోవాలి

బాలకృష్ణుని రాకకై ఎదురుచూపులా

దివినుండి శ్రీదేవి చేరు నీ ఒడి పాపాయిగా

 

చరణం 2:

 

చిట్టి అక్క మేఘాంశ కలల పలుకులు

ఆప్తుల కనుల నక్షత్రపు వెలుగులు

చేతి గాజులు గలగల పాడే శుభాల గానం

ప్రతి నిత్యం నీయింట కృష్ణ మోహనరాగం

 

శ్రీరస్తు శుభమస్తు మన భవ్యకృష్ణకు

మా దీవెనలతో నెలలు నిండిపోవాలి

ఆనందం మన గుండెల్లో పొంగిపోవాలి

బాలకృష్ణుని రాకకై ఎదురుచూపులా

దివినుండి శ్రీదేవి చేరు నీ ఒడి పాపాయిగా

 

- RKSS Creations...

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు