RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, జులై 2024, శుక్రవారం

కరిగిపొమ్మంది ఒక చినుకు | Karigipommandi Oka Chinuku | Song Lyrics | Dharma Chakram (1980)

కరిగిపొమ్మంది ఒక చినుకు 



చిత్రం: ధర్మచక్రం (1980) 

సంగీతం: సత్యం 

గీతరచయిత: మైలవరపు గోపి 

నేపథ్య గానం: బాలు, సుశీల 


పల్లవి :


కరిగిపొమ్మంది ఒక చినుకు 

కలిసి పొమ్మంది ఒక మెరుపు

ఈ చలిలోనీ ఒడిలో తీయని కౌగిలిలో

కరిగిపొమ్మంది ఒక చినుకు 

కలిసి పొమ్మంది ఒక మెరుపు

ఈ చలిలోనీ ఒడిలో తీయని కౌగిలిలో

కరిగిపొమ్మంది ఒక చినుకు

కలిసి పొమ్మంది ఒక మెరుపు


చరణం 1 :


నడకే మయూరమాయే 

నడుమే వయ్యారమాయే

మెరుపుగా మారిపోనా 

నీ కళ్ళలో కలిసిపోనా

మైకం ఒకింత మైకం 

బిడియం రవంత బిడియం

చినుకుగా మారిపోనా 

నీ గుండెపై చేరిపోనా

కరిగిపొమ్మంది ఒక చినుకు

కలిసి పొమ్మంది ఒక మెరుపు


చరణం 2 :


తడిసే చకోరి సొగసు 

పొంగే పదారు వయసు

నా పెదవి కోరుతోంది 

తొలి ముద్దు కోరుతోంది

రానీ ముహూర్త సమయం 

కలలే ఫలించు తరుణం

వలపే నివాళి చేసి 

నిలువెల్ల అల్లుకోనా

కరిగిపొమ్మంది ఒక చినుకు

కలిసి పొమ్మంది ఒక మెరుపు


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు