RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, జులై 2024, శుక్రవారం

ఇది మేఘ సందేశమో | Idi Meghasandesamo | Song Lyrics | Yedantastula Meda (1980)

ఇది మేఘ సందేశమో



చిత్రం :  ఏడంతస్తుల మేడ (1980)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  రాజశ్రీ

నేపథ్య గానం :  సుశీల, బాలు


పల్లవి : 


అహ.. హా..హా..

అహహహ.. ఆ ఆ ఆ హా


ఇది మేఘ సందేశమో.. 

అనురాగ సంకేతమో

ఆ.. ఆ.. ఇది మేఘ సందేశమో.. 

అనురాగ సంకేతమో


చిరుజల్లు కురిసింది వినువీథిలో

చిరుజల్లు కురిసింది వినువీథిలో


హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో..

ఇది మేఘ సందేశమో.. 

అనురాగ సంకేతమో 


చరణం 1 :


అహ.. హా..హా..

అహహహ.. ఆ ఆ ఆ హా


వెల్లువలా పొంగే నా పాల వయసు

పల్లవి పాడేను నా మూగ మనసు

వెల్లువలా పొంగే నా పాల వయసు.. ఆ.. ఆ.. ఆ..

పల్లవి పాడేను నా మూగ మనసు


నీ పాట నా బాట కావాలని

ఆ నింగి ఈ నేల కలవాలని


చినుకులు వేశాయి ఒక వంతెన

చినుకులు వేశాయి ఒక వంతెన

కలిసిన హృదయాలకది దీవెనా   


ఇది మేఘ సందేశమో.. 

అనురాగ సంకేతమో


చరణం 2 :


తడిసిన తనువేదో కోరింది స్నేహం..

కలిగెను జడి వాన నాకు దాహం

తడిసిన తనువేదో కోరింది స్నేహం..

ఆ.. హా..కలిగెను జడి వాన నాకు దాహం


నీ చెంత నే మేను మరవాలనీ

నీ కంటిలో పాప కావాలనీ


వలపులు చేశాయి వాగ్దానము..హా.. ఆ.. ఆ

వలపులు చేశాయి వాగ్దానము

మనకివి సిరులింక కలకాలము


ఇది మేఘ సందేశమో.. 

అనురాగ సంకేతమో


చిరుజల్లు కురిసింది విను వీధిలో

చిరుజల్లు కురిసింది విను వీధిలో

హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో..


ఇది మేఘ సందేశమో.. 

అనురాగ సంకేతమో


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు