ఏవఁమ్మా నిన్నేనమ్మా
చిత్రం: తేనె మనసులు (1965)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఊఁ ఏదోలెండి మీ దయవల్ల
ఈలా ఉన్నాను
ఆలాగంటే ఏలాగండి
అయినవాళ్ళని అడిగాము
ఆలాగంటే ఏలాగండి
అయినవాళ్ళని అడిగాము
అంతేలెండి అంతకు మించి
ఏదో ఏదో ఉందని అన్నానా
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
చరణం 1:
నడవకు నడవకు అమ్మయ్యో
నడిచావంటే అమ్మయ్యో
నడుమే నలిగిపోతుంది
నీ నడుమే నలిగిపోతుంది
నడుమే నలిగిపోతుంది
నీ నడుమే నలిగిపోతుంది
పొగడకు పొగడకు అయ్యయ్యో
పొగిడారంటే అయ్యయ్యో
మనిషే వెగటైపోతారు
మనిషే వెగటైపోతారు
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
చరణం 2:
చూడకు అలా చూడకు ..
చూసావంటే ఏదో ఏదో ఔతోంది ..
ఎదలో ప్రేమే పుడుతోంది
ఏదో ఏదో ఔతోంది ..
ఎదలో ప్రేమే పుడుతోంది
పుట్టనీ పాపం పుట్టనీ ప్రేమే పుడితే
పెంచేదాన్నీ నేనున్నా
లాలించేదాన్నీ నేనున్నా
జోజోజో… జోజోజో…
జోజోజో… జోజోజో…
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి