RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, ఏప్రిల్ 2024, శనివారం

ఊరికే కొలను నీరు | Oorike kolanu neeru | Song Lyrics | Sampoorna Ramayanam (1971)

ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది



చిత్రం :  సంపూర్ణ రామాయణం (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


ఊరికే కొలను నీరు.. 

ఉలికి ఉలికి పడుతుంది

ఓరగా నెమలి 

పింఛమార వేసుకుంటుంది


ఎందుకో ఎందుకో ప్రతి పులుగు 

యేదో చెప్పబోతుంది

వనములో చెట్టు చెట్టు 

కనులు విప్పి చూస్తుంది

ఉండుండీ నా ఒళ్ళు 

ఊగి ఊగి పోతుంది


చరణం 1 :


అదిగో రామయ్య! ఆ అడుగులు నా తండ్రివి

ఇదుగో శబరీ! శబరీ! వస్తున్నానంటున్నవి

కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని

నా కోసమే నా కోసమే నడచి నడచి నడచి

నా కన్నా నిరుపేద నా మహరాజు 

పాపం అదుగో


అసలే ఆనదు చూపు.. ఆ పై ఈ కన్నీరు

తీరా దయ చేసిన నీ రూపు తోచదయ్యయ్యో

ఏలాగో.. నా రామా.. ఏదీ.. ఏదీ.. ఏదీ..

నీల మేఘమోహనము.. 

నీ మంగళ రూపము


చరణం 2 :


కొలను నడిగి తేటనీరు.. 

కొమ్మ నడగి పూల తేరు

గట్టు నడిగి.. చెట్టు నడిగి.. 

పట్టుకొచ్చిన ఫలాలు.. 

పుట్ట తేనె రసాలు


దోరవేవో కాయలేవో ఆరముగ్గినవేవో గాని

ముందుగా రవ్వంత చూసి 

విందుగా అందీయనా...

విందుగా అందీయనా


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు