RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, ఏప్రిల్ 2024, శనివారం

భద్రాచల క్షేత్రమహిమ | Bhadrachala Kshetra Mahima | Song Lyrics | Andala Ramudu (1973)

భద్రాచల క్షేత్రమహిమ



చిత్రం: అందాల రాముడు (1973)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆరుద్ర

నేపథ్య  గానం: రామకృష్ణ, జె. వి. రాఘవులు


పల్లవి :


మా తల్లి గోదారి చూపంగ దారి.. 

పడవెక్కి భద్రాద్రి పోదామా

భద్రాద్రి రాముణ్ణి చూదామా.. 

భద్రగిరి మహిమలే విందామా... 

భద్రగిరి మహిమలే విందామా


ఏవిటోయ్ ఆ మహిమలు ?


శ్రీమద్రమారమణ గోవిందో హరి

భక్తులారా.. సుజనులారా... 

సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు

అరణ్యవాస సమయంబున 

పావన గోదావరీ తీరంబున... 

ఒకానొక గిరిని పరికించి,

దానిపై సుంత విశ్రమించినంత... 

ఆ కంధరమ్మొక సుందరపురుషాకృతి దాల్చి . . .

ఏమనినాడనదా


ధన్యుడనైతిని  ఓ రామా..  

నా పుణ్యము పండెను శ్రీరామా

ధన్యుడనైతిని  ఓ రామా..  

నా పుణ్యము పండెను శ్రీరామా

మేరుగిరీంద్రుని పుత్రుడను..  

నీ రాకకు చూచే భద్రుడనూ

నారీ శిరోమణి సీతమ్మతో మీరు.. 

నా శిరసున నెలకొన వేడెదనూ

కారుణ్యాలయ కామిత మీడేర్చ..  

కలకాలము నిను కొలిచెదనూ

ధన్యుడ . . ధన్యుడ . . 

ధన్యుడనైతిని  ఓ రామా... 

నా పుణ్యము పండెను శ్రీరామా

అని భద్రుడు ప్రార్థించిన . . 

స్వామివారేమన్నరనగా . . .


వత్సా! నీ ముద్దు చెల్లించుటకు ముందు 

మా తండ్రి మాట చెల్లించవలయును

తదా ఉత్తరోత్తర కాలంబున 

పునర్దర్శనంబు ఇచ్చువాడను  . .  

అని వెడలిపోయిరి

అంతట


వెడలిన రాముడు వెలదిని బాసి... 

ఇడుములలో బడెనూ

కడలికి వారధి గట్టి... 

కఠినాత్ముడు దనుజుని గొట్టి

కలికి చెరను పోగొట్టి...  

కనువిందుగ పట్టము గట్టి

బంధుమిత్రుల తలచుట బట్టి

భక్తుని మాట మరిచాడు . . 

రాముడు పరమావతారమ్ము విడిచాడు

వైకుంఠవాసమ్ము చేరాడు...  

శ్రీమద్రమారమణ గోవిందో హరి . .


చరణం 1 :


కాని భూలొకమున భద్రుడు 

ఎన్నియుగము లైనా ఎదురు చూస్తూ

ఏ విధిముగా శోకించినాడనగా

వచ్చెదనంటివి రామయ్యా... 

వరమిచ్చెదనంటివి రామయ్యా

వచ్చెదనని శెలవిచిన పిమ్మట... 

మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా

వచ్చెనుకద నీ మాటకు మచ్చా..  

అది రానిచ్చెదనా నిను పోనిచ్చెదనా

హెచ్చరింతు నువు మెచ్చెడి తపమున...  

నిచ్చలు జపించి ఖచ్చితముగా

ఓ సచ్చరిత్రనిన్నిచ్చటకీడ్చెద... 

వచ్చెదనంటివి రామయ్యా... 

వరమిచ్చెదనంటివి రామయ్యా

అని శపథంబు చేసి 

మహోగ్ర తపస్సు నాచరించగా . .


సకల సురాసుర యక్ష గంధర్వ 

కిన్నెర కింపురుషాదులు  . .

సంక్షోభమ్మునొందిరి . . అపుడు...


 కదలెను. .  శ్రీ మహావిష్ణువు కదలెను. . 

భక్తసహిషువు

సుదతి శ్రీదేవికి సుంతయినా తెలుపక.. 

శుభ శంఖచక్రాల కరముల దాల్చక

సుదూరమౌ భూలోకమునకు...  

సుపర్ణుని భుజమైన ఏక్కకా

వడివడి కదలెను శ్రీమహావిష్ణువు  ... 

కదలెను. . భక్తసహిషువు . .

శ్రీమద్రమారమణ గోవిందో . . హారి


చరణం 2 :


గజేంద్రమోక్ష సన్నివేశంబుకై వడి . . .

స్వామి వారు ఆ విధమ్ముగాకదలగా

తన వెంటన్ సిరి.. లచ్చి వెంట 

నవరోధ వ్రాతమున్.. దానివె

న్కను బక్షీంద్రుడు.. 

వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ

క్రనికాయంబునూ...

హుటాహుటిని రాగా.. 

తొందరయందు అపసవ్యంబుగా 

ఆయుధములు ధరించి . . స్వామి

వారు భద్రునకు దర్శనంబీయ 

ఆ భక్త శిఖామణి ఏమన్నాడు


ఏవరివయ్య స్వామి నేను నిన్నెరుగను...  

హరిని నేనటంచు అనగనేల

నాడు నన్నుబ్రోచు నారాముడవునావు... 

నాటి రూపుచూప నమ్మగలను

అని భద్రుడుకోరగా... 


శ్రీమహావిష్ణువు  తొలినాటి 

రామావతారమ్ము ప్రదర్శించెను . .

అపసవ్యమ్ములైన ఆయుధమ్ములు... 

ఆ తీరుగనే చేతుల నెల్చెను . . .

భద్రుడు మహదానందబరితుడై


ఈ తీరుగనె ఇచ్చట వెలయుము... 

ఇనకులసోమా రామా

భూతలమున ఇది సీతారాముల 

పుణ్యక్షేత్ర లలామా . . 

శభాష్

అని విన్నవించగా స్వామివారు 

ఆ తీరు గనే వెలసిరి


ఆ భద్రుడే భద్రాద్రి అయ్యెను... 

భద్రగిరి వాసుడైన శ్రీరామచంద్రుడు

ఎండకు ఎండి వానకు తడిసి 

నీడకు తపించినవాడై . . .


చరణం 3 :


ఒకనాడు శబరి అంశమున జన్మించినదైన

పోకల దమ్మక్క అను భక్తురాలి 

స్వప్నమున సాక్షాత్కరించి ఆ వైనమ్ము తెలుపగా . . .

ఆయన భద్రగిరినంతయు గాలించగా

స్వామివారి దివ్యసుందరమూర్తి కనిపించెను


కోరి కనిపించావా కోదండరామయ్యా... 

గుడి కట్టలేని ఈ బడుగుపేదకు నీవు

కోరి కనిపించావా కోదండరామయ్యా... 

గుడి కట్టలేని ఈ బడుగుపేదకు నీవు

చక్రవర్తి కుమారుడా... 

ఇంకో చక్రవర్తికి అల్లుడా

భూచక్రమేలిన సార్వభౌమా... 

విధివక్రించి నీకే వాసమ్ముకరువా

తాటాకు పందిరే తాటకాంతక...  

నీకు భవనమయ్యా

తాటిపండ్లే ఓ మేటి రాజకుమార  

విందులయ్యా....  

నీకు విందులయ్యా

అని పోకల దమ్మక్క నిత్యము 

సేవించుకొనెను... 


తదుత్తర కాలంబున రామదాసుగా 

ప్రఖ్యాతుడైన కంచెర్ల గోపన్న

ఏ విధముగా ఆలయ నిర్మాణము గావించెననగా...  


ఏవిధముగానా . .  అప్పుజేసి

తప్పు నాయనా... 


గోపన్న చరితము లోకవిఖ్యాతము

తదీయ సంస్మరణము మంగళదాయకము


రామచంద్ర్రయ జనక రాజజామనోహరాయ... 

మామకాభీష్టదాయ మహిత మంగళం

సీతా...  రామచంద్ర్రయ 

జనక రాజజామనోహరాయ... 

మామకాభీష్టదాయ మహిత మంగళం

మహిత మంగళం  మహిత మంగళం...  

మహిత మంగళం  మహిత మంగళం

జై శ్రీమద్రమారమణ గోవిందో  హరి:


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు