మము బ్రోవమని చెప్పవే
చిత్రం : అందాల రాముడు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : రామకృష్ణ
పల్లవి :
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ...
మము బ్రోవమని చెప్పవే
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ...
మము బ్రోవమని చెప్పవే
ఏకాంత రామయ్య నీ చెంతగా చేరి...
చల్లంగ నీ ముద్దు చెల్లించు వేళ
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ...
మము బ్రోవమని చెప్పవే
చరణం 1 :
మీరూ ఈ గోదారీ తీరాన నడిచారు...
కన్నీళ్ళు నవ్వూలు కలబోసుకు న్నారూ
ఆ కథను కాస్త గురుతు చేసుకొమ్మనీ...
మా కష్టాలు కాస్త చూసిపొమ్మని
నువ్వయినా చెప్పవమ్మా
రామయ్యకూ... ఆ అయ్యకూ
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ...
మము బ్రోవమని చెప్పవే
చరణం 2 :
మా రాజులు మంత్రులు
మిమ్మడగ వచ్చేవారలే...
మా బోటి దీనులు
మీ కడకు వచ్చేవారలే
ఇంతొ అంతొ ముడుపు కట్టి
అంతటయ్యను మాయచేసి
లక్షలో మోక్షమ్ముకోరే
గడుసు బిచ్చగాళ్ళము..
వట్టి పిచ్చివాళ్ళము
ఆదుకొమ్మని పైకి చేదు కొమ్మని చెప్పవమ్మా
రామయ్యకు.. మా అయ్యకు
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ...
మము బ్రోవమని చెప్పవే
చరణం 3 :
పులిని చూస్తే పులీ యెన్నడు బెదరదూ...
మేక వస్తే మేక యెన్నడు అదరదూ
మాయరోగమదేమో గాని
మనిషి మనిషికి కుదరదు
ఎందుకో తెలుసా తల్లీ...
ఉన్నది పోతుందన్న బెదురుతో
అనుకున్నది రాదేమోనన్న అదురుతో
కొట్టుకొంటూ తిట్టుకుంటూ
కొండకెక్కేవాళ్ళము...
మీ అండ కోరే వాళ్ళము
కరుణించమని చెప్పవే మా కన్నతల్లి...
కరుణించమని చెప్పవే
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ...
మము బ్రోవమని చెప్పవే
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి