RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, అక్టోబర్ 2023, గురువారం

కలయా నిజమా | Kalaya Nijama | Song Lyrics | Coolie No 1 (1991)

కలయా నిజమా



చిత్రం: కూలీ NO. 1 (1991)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: సుశీల, ఇళయరాజా


పల్లవి:


కలయా... నిజమా... 

తొలిరేయి హాయి మహిమా ..ఆ..ఆ

కలయా... నిజమా... 

తొలిరేయి హాయి మహిమా..ఆ..ఆ

అలవాటు లేని సుఖమా... 

ఇక నిన్ను ఆప తరమా

అణిగున్న ఆడతనమా.. 

ఇకనైన మేలుకొనుమా


కలయా... నిజమా... 

తొలిరేయి హాయి మహిమా..ఆ..ఆ

కలయా... నిజమా...


చరణం 1:


లేనిపోని ఏ కూనిరాగమో 

లేచిరా అంటున్నదీ.. అహా...

ఊరుకోని ఏ వెర్రి కోరికో 

తీర్చవా అంటున్నదీ..ఈ...

కోక ముళ్ళ కూపీ తీసే 

కైపు చూపు కొరుకుతున్నది...

కుర్ర కళ్ళు చీర గళ్ళలో... 

దారే లేక తిరుగుతున్నవి...

ముంచే మైకమో... 

మురిపించే మోహమో....


కలయా... నిజమా... 

తొలిరేయి హాయి మహిమా...ఆ..

కలయా... నిజమా...


చరణం 2:


చేయి వేయనా ..సేవ చేయనా.. 

ఓయ్ అనే వయ్యారమా.. హహ హ..

పాల ముంచినా ..నీట ముంచినా.. 

నీ దయే శృంగారమా... అహా...

ఆగలేని ఆకలేవిటో.. 

పైకి పైకి దూకుతున్నది

కాలు నేల నిలవకున్నది.. 

ఆకాశాన తేలుతున్నది..

హా అంతా మాయగా.. 

అనిపించే కాలమూ...


కలయా... నిజమా... 

తొలిరేయి హాయి మహిమా...

కలయా... నిజమా... 

తొలిరేయి హాయి మహిమా..ఆ..ఆ

అలవాటు లేని సుఖమా... 

ఇక నిన్ను ఆప తరమా

అణిగున్న ఆడతనమా.. 

ఇకనైన మేలుకొనుమా


కలయా...అహ.. నిజమా...అహ.. 

తొలిరేయి హాయి మహిమా..ఆ..ఆ

ఉహు..ఉహు..ఉహు...


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు