ఈశ్వరీ జయము నీవే
చిత్రం : రాజకోట రహస్యం (1971)
రచన : డా॥ సి.నారాయణరెడ్డి
సంగీతం : విజయా కృష్ణమూర్తి
గానం : ఘంటసాల, బృందం
శ్లోకం :
సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే
పల్లవి :
ఈశ్వరీ జయము నీవే
పరమేశ్వరీ అభయమీవే
ఈశ్వరీ జయము నీవే
పరమేశ్వరీ అభయమీవే
చరణం : 1
సూర్యులు కోటిగ చంద్రులు కోటిగ
మెరసిన తేజము నీవే దేవి
శక్తి వర్ధనివి వరదాయినివే
శక్తి వర్ధనివి వరదాయినివే
ఇహమూ పరమూ నాకిక నీవే
చరణం : 2
మంత్రతంత్రముల మాయల ప్రబలిన
క్షుద్రుల పీడకు బలియగుటేనా
దుష్టశక్తులను రూపుమాపగ...
దుష్టశక్తులను రూపుమాపగ...
మహా మహిమనే నాకిడ లేవా
చరణం : 3
నిరపరాధులగు తల్లిదండ్రులు సతి
క్రూరుని హింసకు గురియగుటేనా
దుర్మార్గులనిక నాశము చేసి
దుర్మార్గులనిక నాశము చేసి
తరించు వరమిడి దయగనరావా
ఓం నారాయణి... ఓం నారాయణి
చరణం : 4
ప్రాణము లైదుగ వేదనలైదుగ
పరిపరి విధముల నినువేడితినే
అమోఘ మహిమల ఆదిశక్తివే
ఓం నారాయణి... ఓం నారాయణి
అమోఘ మహిమల ఆదిశక్తివే
చలమూ బలమూ నాకికనీవే దేవి... దేవి...
ఓం నారాయణి... ఓం నారాయణి
ఓం నారాయణి... ఓం నారాయణి
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి