నీ పిలుపే ప్రభాత సంగీతం
చిత్రం : సుబ్బారావుకి కోపం వచ్చింది (1981)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. ఆ..
నీ పిలుపే.. ప్రభాత సంగీతం
నీ వలపే.. మధుమాసం
నీ హృదయం.. రసనిలయం
ఆ ఆ ఆ .....
నీ పిలుపే.. ప్రభాత సంగీతం
నీ వలపే.. మధుమాసం
నీ హృదయం.. రసనిలయం
నీ హృదయం.. రసనిలయం
చరణం 1 :
ఊహలు పలికే ఉత్పలమాలలు...
ఆ..ఆ..ఆ...
భావన లొలికే చంపక మాలలు..
నీ జడలోనా నిత్యం ముడిచి..
నీ అడుగులపై కానుక చేసి..
కొలిచే నీ కవిరాజునై.. నిలిచేనా....
వలచేనా..
నీ పిలుపే..ఆ .. ప్రభాత సంగీతం.. ఆ
నీ వలపే.. మధుమాసం.. ఆ ఆ ..
నీ హృదయం.. రసనిలయం
చరణం 2 :
నందనవనమే పందిరి చేసి..
ఆ...ఆ...ఆ...
పరువం నురగల పానుపు వేసి..
మలయ సమీరం వీవెన వీచి..
రసమయ లోకం అంచులు చూసి..
కలిసే నీ సురభామనై.. మురిసేనా....
మెరిసేనా...
నీ పిలుపే.. ప్రభాత సంగీతం
నీ వలపే.. మధుమాసం
నీ హృదయం.. రసనిలయం
నీ హృదయం.. రసనిలయం
హ...ఆ...ఆ...ఆ..ఆ
ఆ...ఆ...ఆ...ఆ...
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి