RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

6, సెప్టెంబర్ 2023, బుధవారం

మల్లియలారా మాలికలారా | Malliyalara Malikalara | Song Lyrics | Nirdhoshi (1967)

మల్లియలారా మాలికలారా



చిత్రం: నిర్దోషి (1967)

సంగీతం: ఘంటసాల

గీతరచయిత: సినారె

నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి:


మల్లియలారా మాలికలారా... 

మౌనముగా ఉన్నారా

మా కథయే విన్నారా ....


మల్లియలారా మాలికలారా... 

మౌనముగా ఉన్నారా

మా కథయే విన్నారా...


చరణం 1:


జాబిలిలోనే జ్వాలలు రేగే... 

వెన్నెలలోనే చీకటి మూగే

జాబిలిలోనే జ్వాలలు రేగే...  

వెన్నెలలోనే చీకటి మూగే


పలుకగ లేక పదములు రాక...

పలుకగ లేక పదములు రాక... 

బ్రతుకే తానే బరువై సాగే


మల్లియలారా మాలికలారా... 

మౌనముగా ఉన్నారా

మా కథయే విన్నారా...


చరణం 2:


చెదరిన వీణ రవళించేనా.... 

జీవన రాగం చివురించేనా

చెదరిన వీణ రవళించేనా.... 

జీవన రాగం చివురించేనా


కలతలు పోయి వలపులు పొంగి...

కలతలే పోయి వలపులే పొంగి... 

మనసే లోలో పులకించేనా


మల్లియలారా మాలికలారా... 

మౌనముగా ఉన్నారా

మా కథయే విన్నారా.....


పాటల ధనుస్సు 


1 కామెంట్‌:

  1. సంధర్భోచితంగా సాహిత్య సంగీత విలువలతో సాగిన సోలో గీతం.నటరత్న నందమూరి పై చిత్రీకరణ కాబట్టి పాటకి అంతకంటే న్యాయం ఇంకెవరు చేయగలరు!!!

    రిప్లయితొలగించండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు