RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, ఆగస్టు 2022, శనివారం

వానొచ్చే వరదొచ్చే | Vanoche varadoche | Song Lyrics | Kondaveeti Simham (1981)

వానొచ్చే వరదొచ్చే



చిత్రం: కొండవీటి సింహం (1981)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే 

నీలో గోదారి పొంగే ...

నీ పొంగులలో మునిగి నీ కౌగిలిలో కరిగి 

అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే


వానొచే వరదొచ్చే వలపించే మనసిచ్చే 

నీలో నా ఈడు పొంగే...

నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి 

కలలెన్నో పులకించి కౌగిళ్ళు చేరే


చరణం 1:


ఆకాశమంత పందిళ్ళు వేసి .. భూలోకమంత పీటల్లు వేసి

ఆశమంత పందిళ్ళు వేసి .. భూలోకమంత పీటల్లు వేసి

కౌగిళ్ళలోనే నా ఈడు చూసి .. నీ కళ్ళతోనే అ ముళ్ళు వేసి

త్వరపడి మది త్వరపడి నీ జత చేరితే

ఉరవడి నా చెలి ఒడిలో చెలరేగితే

నాలో .. నీలో ...తొలి కోరిక చలి తీరక నిను చేరగా 

తనువులు ముడిపడినవి ఈ చలిగాలిలో..


వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే 

నీలో గోదారి పొంగే ...

నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి 

కలలెన్నో పులకించి కౌగిళ్ళు చేరే


చరణం 2:


కార్తీకవేళా కన్నుల్లు కలిసే ..ఏకంతవేళా యెన్నెల్లు కురిసే

కార్తీకవేళా కన్నుల్లు కలిసే ..ఏకంతవేళా యెన్నెల్లు కురిసే

నీ చూపులోన సూరీడు మెరిసే .. నీ ఈడుతోనె నా ఈడు ఒరిసే

తడి అలజడి చలి ముడివడి నిను కోరితే

ఎడదల సడి పెదవులబడి సుడిరేగితే

నీవే ..నేనై.. తొలి జంటగా చలి మంటలే ఎదనంటగ 

రగిలేను సెగలకు వగలీ చలిమంటలో..


వానొచే వరదొచ్చే వలపించే మనసిచ్చే 

నీలో నా ఈడు పొంగే...

నీ మాటలకే అలిగి నీ పాటలలో వెలిగి 

కలలెన్నో పులకించి కౌగిళ్ళు చేరే

వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే 

నీలో గోదారి పొంగే ...

నీ పొంగులలో మునిగి నీ కౌగిలిలో కరిగి 

అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే


పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు