RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

9, ఆగస్టు 2022, మంగళవారం

ఓ కుర్రవాడా వెర్రివాడా | O Kurravada Verrivada | Song Lyrics | Pichimaraju (1975)

ఓ కుర్రవాడా వెర్రివాడా



చిత్రం: పిచ్చిమారాజు (1975)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


ఓ కుర్రవాడా .. వెర్రివాడా ఓ కుర్రవాడా .. వెర్రివాడా 

ఎందుకిలా.. నువ్వెందుకిలా

నన్నొదిలి యిలా పారిపోతావు...


ఓ కుర్రదానా... వెర్రిదానా ఓ కుర్రదానా... వెర్రిదానా 

ఎందుకిలా.. నువ్వెందుకిలా

నన్నొదలకిలా తరుముకొస్తావూ...


చరణం 1:


నేలకి నింగికి కలవదమ్మా

నీకు నాకు పొత్తెపుడు కుదరదమ్మా...

ఆ..నేలకి నింగికి కలవదమ్మా

నీకు నాకు పొత్తెపుడు కుదరదమ్మా.


నింగిలోని వెన్నెలంత నేలకే సొంతము

నీకూ నాకూ ఉన్నది అదే బంధము... ఆహా..

నింగిలోని వెన్నెలంత నేలకే సొంతము

నీకూ నాకూ ఉన్నది అదే బంధము ....


ఓ కుర్రదానా... వెర్రిదానా

ఎందుకిలా.. నువ్వెందుకిలా

నన్నొదలకిలా తరుముకొస్తావూ...


చరణం 2:


చల్లగాలి ఊరుకోదు... పిల్లమనసు ఓర్చుకోదు..

ఓర్చుకోనీ పిల్లదాన్ని ఓపలేను.. ఆపలేను...

చల్లగాలి ఊరుకోదు... పిల్లమనసు ఓర్చుకోదు..

ఓర్చుకోనీ పిల్లదాన్ని ఓపలేను ఆపలేను...


ఏం చేయమంటావు నన్ను...

నన్నెలా వదలమంటావు నిన్ను...


ఓ కుర్రవాడా .. వెర్రివాడా

ఎందుకిలా.. నువ్వెందుకిలా

నన్నొదిలి యిలా పారిపోతావు...


చరణం 3:


అందాలతో నాకు బంధాలు వేయకు

పిచ్చివాణ్ణి మరీమరీ రెచ్చగొట్టకు....

అందాలతో నాకు బంధాలు వేయకు

పిచ్చివాణ్ణి మరీమరీ రెచ్చగొట్టకు....


రెచ్చితే పిచ్చి ఎంతో ముచ్చటగ ఉంటుంది

ముచ్చటైన కౌగిట్లో పిచ్చి కుదిరిపోతుంది...

రెచ్చితే పిచ్చి ఎంతో ముచ్చటగ ఉంటుంది

ముచ్చటైన కౌగిట్లో పిచ్చి కుదిరిపోతుంది...


ఓ కుర్రదానా... వెర్రిదానా

ఎందుకిలా..నువ్వెందుకిలా

నన్నొదలకిలా తరుముకొస్తావూ...


ఓ కుర్రవాడా .. వెర్రివాడా

ఎందుకిలా.. నువ్వెందుకిలా

నన్నొదిలి యిలా పారిపోతావు..


ఓ కుర్రదానా... ఓ కుర్రవాడా...

ఓ వెర్రిదానా... ఓ వెర్రివాడా...

ఓ కుర్రదానా... ఓ కుర్ర వాడా


పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు