పూసింది పూసింది పున్నాగ
చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, చిత్ర
పల్లవి :
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళలాగేసె సల్లంగా దాని
సన్నాయి జడలోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ..... జతులాడ........
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళలాగేసె సల్లంగా దాని
సన్నాయి జడలోన సంపెంగ
చరణం 1 :
ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటిపాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే...... మదిపాడే......
చరణం 2 :
పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి ఆ భేరిరాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూలతోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసే.... విరబూసే......
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి